MLC Sunitha: ఏపీలో మాజీ సీఎం జగన్ కు వరుసగా షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే వైసీపీకి చెందిన కొందరు కీలక నేతలు పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరారు. ఈ క్రమంలోనే ఎంపీ మోపిదేవి వెంకటరమణ కూడా వైసీపీకి రాజీనామా చేసి త్వరలో టీడీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది.
Also Read: జగన్‌కు మరో బిగ్ షాక్.. టీడీపీలోకి వైసీపీ ఎంపీ!
తాజాగా, వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఎమ్మెల్సీ పోతుల సునీత వైసీపీకి గుడ్ బై చెప్పారు. ప్రస్తుతం వైసీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా ఉన్న సునీత.. పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామ చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు రాజీనామా లేఖను జగన్‌కు పంపినట్లు తెలుస్తోంది. త్వరలో తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని వెల్లడించారు.