MLC Parvatha Reddy Chandra Shekar Reddy: రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు మార్పును కోరుకున్నారన్నారు ఎమ్మెల్సీ, వైసీపీ జిల్లా అధ్యక్షుడు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. ప్రజల ఆకాంక్షలను గౌరవిస్తున్నామని కామెంట్స్ చేశారు. నెల్లూరు వైసీపీ జిల్లా కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేశామన్నారు. రాష్ట్రంలో అనేక వినూత్న కార్యక్రమాలను చేపట్టి ప్రజలకు మేలు చేకూర్చిన ప్రజలు మార్పుకు పట్టం కట్టారన్నారు.
Also Read: ఆ చెత్త అధికారి వల్లే జగన్ ఓటమి.. మాజీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..!
40 శాతం మంది ప్రజలు వైసీపీకి అండగా నిలబడ్డారని వ్యాఖ్యానించారు. ఇకనుంచి ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తామన్నారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఒక నెల రోజులకు ముందే తను వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టానని, జిల్లాలో ఓటమికి నైతిక బాధ్యతగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశిస్తే పార్టీ అధ్యక్ష పదవితో సహా రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నాననిపేర్కొన్నారు.
MLC Parvatha Reddy : జగన్ ఆదేశిస్తే రాజీనామా చేస్తా.. వైసీపీ ఎమ్మెల్సీ షాకింగ్ కామెంట్స్..!
జగన్ ఆదేశిస్తే రాజీనామా చేస్తానన్నారు నెల్లూరు వైసీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. ప్రజలు మార్పును కోరుకున్నారని కామెంట్స్ చేశారు. జిల్లాలో ఓటమికి నైతిక బాధ్యతగా పార్టీ అధ్యక్ష పదవితో సహా రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు.