MLC Palla Rajeshwar Reddy: రేవంత్‌ను అలా పోల్చడం కూడా తక్కువే.. సంచలన కామెంట్స్ చేసిన పల్లా..

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 20 కన్నా తక్కువ సీట్లు వస్తాయని, బీఆర్ఎస్‌ గెలుపు గ్యారెంటీ అని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి వ్యాఖ్యనించారు. రేవంత్ ను కుక్కతో పోల్చడం కూడా తక్కువే అన్నారు. ఎదుటివారిని తిట్టడం ద్వారా గొప్పవాళ్లైపోతామని అనుకుంటున్నారు. తాము అనవసరం లేదు...వద్దు అనుకున్న నేతలే కాంగ్రెస్ వైపు వెళ్తున్నారని ఆయన అన్నారు. ఆర్‌టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పల్లా తన మనోభావలను వెల్లడించారు.

New Update
MLC Palla Rajeshwar Reddy: రేవంత్‌ను అలా పోల్చడం కూడా తక్కువే.. సంచలన కామెంట్స్ చేసిన పల్లా..

తెలంగాణ ప్రజలు ముచ్చటగా మూడోసారి కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారన్నారు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కేవలం తమ ఆత్మయులకే పదవి ఇచ్చారన్న విమర్శలను ఆయన ఖండించారు. కచ్చితంగా గెలుస్తారనే అభ్యర్ధులకే సీఎం కేసీఆర్ టిక్కెట్ ఇచ్చారని పేర్కొన్నారు. అసంతృప్తి నేతలను పరామర్శించిన ఎమ్మెల్సీ పల్లా..సీటు రాని వారికి తగిన స్ధానం బీఆర్‌ఎస్ ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. ప్రస్తుతం బీఆర్‌ఎస్ పార్టీలో రెబల్స్‌ ఎవ్వరూ లేరని అన్నారు. పార్టీలో ఎవరైనా కట్టుబాట్లు దాటితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ముత్తిరెడ్డి చేస్తున్న విమర్శలకు సరైన సమయంలో సమాధానం చెబుతానన్నారు ఎమ్మెల్సీ పల్లా. మైనంపల్లి విషయం పార్టీ పరిశీలనలో ఉందన్నారు. పార్టీలో తుమ్ముల ఉన్నా..లేకున్న పెద్ద తేడా కన్పించదంటూ వ్యాఖ్యనించారు.

ఆ పార్టీ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్..

కేసీఆర్‌ గజ్వేల్‌తో పాటు కామారెడ్డిలో పోటీ చేయడంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను కొట్టిపారేశారు. కేవలం ఓటమి భయంతోనే ఎవరైనా రెండు చోట్ల పోటీ చేస్తారా అంటూ పల్లా ప్రశ్నించారు. ఆ రెండు నియోజకవర్గాలు కేసీఆర్‌ మూలాలని అన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్‌కు ప్రతిపక్షం కాంగ్రెస్‌ మాత్రమేనన్నారు. కమలంకు మూడు, నాలుగు సీట్లు కూడా కష్టమేనంటున్నారు. ఇక వైఎస్సాఆర్‌టీపీ గురించి ఎంత తక్కవ మాట్లాడితే అంత బెటర్ అని రియాక్ట్ అయ్యారు. అయితే వామపక్షాలతో పొత్తు ఉంటే బాగుండేదని ఫీల్ అయ్యారు.

తిట్టినా ఖండించలేని దీన స్థితిలో..

దేశంలో తెలంగాణ అగ్రస్దానంలో ఉందన్నారు ఎమ్మెల్సీ పల్లా. బంగారు తెలంగాణాగా తీర్చిదిద్దిన ఘనత సీఎం కేసీఆర్ దే అంటూ కీర్తించారు.కేసీఆర్‌ పాలనలో రైతులు సంతోషంగా ఉన్నారని అన్నారు. దేశా అభివృద్దిని కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలు వెనక్కి నెట్టేశాయని అన్నారు. కాంగ్రెస్ కుటుంబ చరిత్రను తిట్టిన తిరిగి ఖండించలేని దీన స్ధితిలో వారు ఉన్నారని ఎమ్మెల్సీ పల్లా అన్నారు.

Also Read: 

Advertisment
తాజా కథనాలు