MLC Duvvada srinivas: దువ్వాడ ఫ్యామిలీ డ్రామాలో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. తాను ఉంటున్న ఇంటిని కాపాడుకునేందుకు దువ్వాడ శ్రీను కొత్త ప్లాన్ వేశారు. ఇంటికి ఎమ్మెల్సీ ఆఫీస్‌గా ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఒకవైపు ఆ ఇంటిపై తనకు హక్కు కావాలని భార్య వాణి అంటుండగా.. మరోవైపు ఆ ఇంటికి తాను రూ.2 కోట్లు ఇచ్చానని దివ్వల మాధురి అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన తన ఇంటిని పార్టీ ఆఫీస్‌గా మార్చారనే ప్రచారం జరుగుతోంది.
Also Read: బొత్సకు కేబినెట్ ర్యాంక్ పదవి.. జగన్ సంచలన నిర్ణయం!
ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, వాణి వివాదంపై వారి బంధువులు రాజీ కుదర్చడానికి చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. దువ్వాడ శ్రీనివాస్‌కు భార్య వాణి తన ఐదు డిమాండ్స్ ను ముందుంచారు. తొలి 4 డిమాండ్లకు ఒప్పుకున్న దువ్వాడ శ్రీనివాస్ ఐదో డిమాండ్‌ను తిరస్కరించారు. ఎందుకంటే ఐదో డిమాండ్ గా దువ్వాడ ఉంటున్న కొత్త ఇంటిని వాణి అడిగారు.
అయితే, తనకంటూ మిగిలిన కొత్త ఇంటిపై తక్షణమే వీలునామా రాస్తే.. తనకు జరగరానిది ఏదైనా జరిగితే పరిస్థితి ఏంటని శ్రీనివాస్ వెనకడుగు వేశారు. ఇలా ఐదో డిమాండ్ దగ్గర దువ్వాడ కుటుంబం పంచాయితీ ఆగిపోయింది.