MLC Duvvada: దువ్వాడ వాణి 5 డిమాండ్స్ ఇవే.. ఆ కండిషన్ కు ఒప్పుకోని ఎమ్మెల్సీ!

ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు భార్య వాణి ఐదు డిమాండ్స్‌ పెట్టినట్లు తెలుస్తోంది. పర్లాకిమిడిలోని గ్రానైట్ ఫ్యాక్టరీ, టెక్కలిలోని పాత ఇళ్లు, కొత్త ఇంటిని ఇవ్వడంతో పాటు పిల్లల చదువులు, వారి మెయింటెనెన్స్ చూసుకోవాలని కండిషన్లు పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి.

MLC Duvvada: దువ్వాడ వాణి 5 డిమాండ్స్ ఇవే.. ఆ కండిషన్ కు ఒప్పుకోని ఎమ్మెల్సీ!
New Update

MLC Duvvada srinivas: ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌, వాణి వివాదంపై వారి బంధువులు రాజీ కుదర్చడానికి చర్చలు జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దువ్వాడ శ్రీనివాస్‌కు భార్య వాణి తన ఐదు డిమాండ్స్ ను ముందుంచారు.

ఐదు డిమాండ్స్ ఇవే..

1. పర్లాకిమిడిలోని 20 కోట్ల విలువైన గ్రానైట్ ఫ్యాక్టరీతో పాటు..దానిపై 40 లక్షల రుణం క్లియర్ చేసి ఇవ్వాలి

2. టెక్కలి, వెంకటేశ్వర కాలనీలోని 6 కోట్ల విలువైన పాత ఇంటిపై..15 లక్షల బ్యాంకు రుణం క్లియర్ చేసి ఇవ్వాలి

3. పిల్లల చదువులు, వారి మెయింటెనెన్స్ శ్రీనివాస్ చూసుకోవాలి

4. విడాకుల అంశాన్ని సామరస్యంగా కోర్టులో పరిష్కరించుకోవాలి

5. కొత్త ఇంటిని, శ్రీనివాస్ తదనంతరం తమకు ఇస్తామని.. తక్షణం వీలునామా రాసి ఇవ్వాలి

Also Read: ఏపీలో మళ్లీ హాట్ టాపిక్ గా అగ్రిగోల్డ్.. 30 లక్షల మందిని ముంచిన ఈ స్కామ్ గురించి తెలుసా?

ఈ ఐదు డిమాండ్లను దువ్వాడ శ్రీనివాస్‌ భార్య వాణి కోరారు. అయితే, తొలి 4 డిమాండ్లకు దువ్వాడ శ్రీనివాస్ ఒప్పుకున్నట్లు తెలుస్తుంది. దీంతో ఐదో డిమాండ్‌పై అనిశ్చితి నెలకొంది. తనకంటూ మిగిలిన కొత్త ఇంటిపై తక్షణమే వీలునామా రాస్తే.. తనకు జరగరానిది ఏదైనా జరిగితే పరిస్థితి ఏంటని శ్రీనివాస్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. ఇలా ఐదో డిమాండ్ దగ్గర దువ్వాడ కుటుంబం పంచాయితీ ఆగింది. ఆ ఐదో డిమాండ్ కు కూడా దువ్వాడ ఒకే అంటారా? లేదా అనేది తెలియాల్సి ఉంది.

ఇలా దువ్వాడ ఫ్యామిలీలో ఎటూతెగని పంచాయితీ నడుస్తోంది. మరోవైపు వాణి ఆరోపణల కారణంగానే తాను ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపిన దివ్వల మాధురి ఈరోజు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ క్రమంలోనే తాను మోసపోయానంటూ, ఒంటరిగా మిగిలిపోయానంటూ దివ్వెల మాధురి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ మొత్తం వివాదంపై మాధురి భర్త మహేశ్‌ రిసెంట్ గా స్పందించారు. మాధురికి అన్నివిధాలా అండగా ఉంటానన్నారు. తను ఎంటో నాకు తెలుసని అన్నారు. మాధురి రాజకీయంగా ఎదుగుతోందనే ఇలా ఆరోపణలు చేస్తున్నారన్నారు.

#mlc-duvvada-srinivas
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి