MLC Duvvada Srinivas: తన ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. RTVతో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. హింసను ప్రేరేపిస్తున్న కూటమి ఆకృత్యాలను ఎదుర్కుంటామన్నారు. ప్రాణాలను పణంగా పెట్టైనా సరే కేడర్ ని కాపాడుకుంటానన్నారు.
Also Read: వీడెవడ్రా బాబు ఇంత విచిత్రంగా ఉన్నాడు.. వీడియో వైరల్..!
ఇసుక దోచేస్తున్నారని, క్వారీలు ముసేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు సంక్షేమ ఫలాలను ఆశించడం లేదని ఫలితాలు స్పష్టం చేసాయని.. జగన్ పాలనలో ప్రజలు లాభపడ్డా, ఎక్కడో ఆయనపై వ్యతిరేకత ఉందన్నారు. ఈ క్రమంలోనే కూటమి ప్రభుత్వం మేనిఫెస్టో వారి పతనానికి కారణం కాబోతోందని పేర్కొన్నారు. పడ్డ చోట నుంచి లేచి పరిగెడతాం అంటూ ఉద్ఘాటించారు.