MLA Yarapathineni Srinivasa Rao: ప్రత్యర్థులపై దాడులు చేస్తే సొంత పార్టీ కార్యకర్తలైన ఉపేక్షించేది లేదన్నారు గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు. ప్రజాస్వామ్యాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాల్సిందేనన్నారు. 151 సీట్ల అధికార మదంతో ప్రజాస్వామ్యంపై వైసీపీ నాయకులు దాడులు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: వైసీపీ వెర్రి కుక్కలు.. వీరి అవినీతికి జైల్లు కూడా సరిపోవు: ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
అందుకే వైసీపీని 11 సీట్లకు మాత్రమే కట్టబెట్టి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని నమ్మకంతోనే కూటమి ప్రభుత్వానికి విజయాన్ని కట్టబెట్టారని.. వారి విశ్వాసాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉందన్నారు. పిన్నెల్లి గ్రామంలో నిన్న వైసీపీ వారి ఇల్లుపై రాళ్లు వేసిన కూటమి కార్యకర్తలను యరపతినేని మందలించారు. చర్యకు ప్రతి చర్య పరిష్కారం కాదన్నారు.
Also Read: రాహుల్ జోలికొస్తే మసైపోతారు.. బీజేపీకి CWC రఘువీరారెడ్డి వార్నింగ్
పాలకపక్షమైన, ప్రతిపక్షమైన ప్రజాస్వామ్యంపై దాడులు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. రాష్ట్రాన్ని అస్తవ్యస్థం చేసి ఖజానాను గత ప్రభుత్వం ఖాళీ చేసిందని, రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎంతో కృషి చేస్తున్నారన్నారు. సమస్య ఏదైనా వెంటనే తనకు తెలియజేస్తే సమస్య పరిష్కరించే విధంగా కృషి చేస్తానన్నారు. లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ప్రతి ఇంటికి కృష్ణా నది నీటిని అందిస్తామని తెలిపారు.