MLA Vasantha: వైసీపీ నుండి ఇందుకే తప్పుకున్నా: వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీలో సీటు ఇస్తానన్నా వదులుకొని బయటికి వచ్చిన ఏకైక ఎమ్మెల్యే తానేనని చెప్పుకొచ్చారు వసంత కృష్ణ ప్రసాద్. వైసీపీ వైఖరి నచ్చకే పార్టీ మారినట్లు తెలిపారు. నియోజకవర్గం అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా కేటాయించకుండా జగన్ ఇబ్బంది పెట్టారని ఆరోపించారు. By Jyoshna Sappogula 05 Mar 2024 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి MLA Vasantha Krishna: RTVతో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఎక్స్ క్లూజీవ్ గా మాట్లాడారు. వైసీపీలో సీటు ఇస్తానన్నా వదులుకొని బయటికి వచ్చిన ఏకైక ఎమ్మెల్యే తానేనని చెప్పుకొచ్చారు. వైసీపీ వైఖరి నచ్చకే పార్టీ మారినట్లు తెలిపారు. నియోజకవర్గం అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా కేటాయించకుండా జగనన్న ఇబ్బంది పెట్టారని ఆరోపించారు. Also Read: ఏపీ రాజధానిపై సీఎం జగన్ సంచలన ప్రకటన! జగన్ సర్కార్ వాళ్ళకు నచ్చిన ఎమ్మెల్యేలకు నిధులు ఇచ్చుకుని.. నాలాంటి వారిని ఇబ్బందులకు గురి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా అభివృద్ధిలో మైలవరాన్ని మంచి స్థానంలో నిలబెట్టినట్లు తెలిపారు. టీడీపీలో సీటు ఆశించి తాను చేరలేదని స్పష్టం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడం కోసమే టీడీపీలో చేరినట్లు వెల్లడించారు. Also Read: ఎమ్మెల్సీకి చెప్పు చూపించిన ఎంపీ.. సిద్ధం సభలో సవాల్! మైలవరం సీటుపై అధిష్టానమే స్పష్టత ఇస్తుందన్నారు. దేవినేనికు తమకు 20 ఏళ్ల వైరం ఉందని కామెంట్స్ చేశారు. ఇప్పటివరకు దేవినేని ఉమాతో తాను మాట్లాడలేదన్నారు. చంద్రబాబు ఇద్దరిని పిలిపించి మాట్లాడతారన్నారు. ఐదేళ్ల ఎమ్మెల్యేగా ఉన్నానని నాకు నాన్ లోకల్ అనే ట్యాగ్ వర్తించదని పేర్కొన్నారు. తనపై కేసులు పెట్టిన ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. కేసీనేని పిచ్చి పిచ్చి విమర్శలు చేస్తున్నాడని విమర్శలు గుప్పించారు. టీడీపీ నిర్ణయం మేరకే నడుచుకుంటానని ఎమ్మెల్యే వసంత తెలిపారు. #mla-vasantha-krishna మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి