MLA Vasantha: దేవినేని ఉమతో కలిసి పనిచేసేందుకు సిద్ధమే కానీ..

మైలవరం సీటుపై ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. అధిష్టానం సమక్షంలో మాట్లాడి దేవినేని ఉమతో కలిసి పనిచేసేందుకు సిద్ధం అన్నారు. అధిష్టానం నియోజకవర్గాన్ని ఎవరికి అప్పచెప్పితే దాని ప్రకారం నడుచుకుంటానన్నారు.

MLA Vasantha: దేవినేని ఉమతో కలిసి పనిచేసేందుకు సిద్ధమే కానీ..
New Update

MLA Vasantha Krishna Prasad: ఏపీ అధికార పార్టీ వైసీపీ (YCP).. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌కు టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే ఈయన రాకతో మైలవరం క్యాడర్ ఫుల్ గందరగోళంలో ఉంది. టీడీపీ (TDP) నుంచి వసంత కృష్ణప్రసాద్ మైలవరం టికెట్‌నే అడుగుతున్నారు. ఇక్కడి నుంచి టీడీపీ నేత దేవినేని ఉమ (Devineni Uma) టికెట్‌ను ఆశిస్తున్నారు. ఇప్పుడు వసంత రావడం మీద దేవినేని భగ్గుమంటున్నారని సమాచారం. దాంతో పాటూ వసంత కృష్ణప్రసాద్‌పై దేవినేని ఉమ పరోక్షంగా విమర్శలు కూడా చేస్తున్నారని తెలుస్తోంది.

Also Read: అసమ్మతి నేతలను బుజ్జగించేందుకు చంద్రబాబు ప్రయత్నాలు ..!

కాగా, మైలవరం సీటుపై తాజాగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనను, ఉమను కలిసి కూర్చొబెట్టి మాట్లాడమని చంద్రబాబును అడుగుతానన్నారు. అధిష్టానం సమక్షంలో మాట్లాడి దేవినేని ఉమతో కలిసి పనిచేసేందుకు సిద్ధం అన్నారు. అధిష్టానం నియోజకవర్గాన్ని ఎవరికి అప్పచెప్పితే దాని ప్రకారం నడుచుకుంటానని అంటున్నారు. దేవినేని ఉమతో ఇప్పటి వరకు జరిగిన విషయాల పై క్లారిఫై చేసుకోవడానికి అభ్యంతరం లేదన్నారు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్. చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వడానికి..ఎవరితో అయినా కలిసి పనిచేసేందుకు సిద్ధమన్నారు.

Also Read: జ్ఞాన‌వాపి మసీదు కేసు.. సంచలన తీర్పు ఇచ్చిన అలహాబాద్ హైకోర్టు!

ఇదిలా ఉండగా పార్టీ కోసం తాను ఎంతో కష్టపడ్డానని… మైలవరం టికెట్ తనకే దక్కాలని ఉమా అంటున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక తెలుగు దేశం పార్టీ తరుపున మైలవరం నుంచి పోటీ చేసేందుకు దేవినేని ఉమామహేశ్వరరావు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా కేడర్‌కు ప్రజలకు దగ్గరయ్యేందుకు ఎన్నికల ప్రచారాన్ని కూడా మొదలుపెట్టారు. ఎట్టిపరిస్థితిలోనైనా మైలవరం సీటు వదిలేది లేదని స్పష్టం చేస్తున్నారు దేవినేని ఉమ. ఈ పరిణామాల నేపథ్యంలో కృష్ణ ప్రసాద్‌ పరిస్థితి ఏంటి? చంద్రబాబు (Chandrababu) ఎవరివైపు మొగ్గు చూపుతారనేది చూడాలి.

#mla-vasantha-krishna-prasad
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe