AP: తీరు మార్చుకోని అధికారులు.. ఎమ్మెల్యే సీరియస్ యాక్షన్..! లంచాలకు అలవాటుపడ్డ ప్రొద్దుటూరు సబ్ రిజిస్టర్ కార్యాలయ సిబ్బందిపై ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజాయితీగా పని చేయాలని చెప్పినా వారు తీరు మార్చుకోకపోవడంతో స్వయంగా యాక్షన్ తీసుకున్నారు. ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లను సెలవుపై వెళ్లిపోవాలని ఆదేశించారు. By Jyoshna Sappogula 20 Aug 2024 in ఆంధ్రప్రదేశ్ కడప New Update షేర్ చేయండి MLA Varadarajulu Reddy: కడప జిల్లా ప్రొద్దుటూరు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో లంచాలకు అలవాటుపడ్డ సిబ్బందిపై ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజాయితీగా పని చేయాలని చెప్పినా వారు తీరు మార్చుకోకపోవడంతో స్వయంగా యాక్షన్ తీసుకున్నారు. ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లను సెలవుపై వెళ్లిపోవాలని ఆదేశించారు. Also Read: తాడిపత్రిలో టెన్షన్ టెన్షన్.. జేసీ VS పెద్దారెడ్డి! గతంలో సబ్ రిజిస్టర్ కార్యాలయ సిబ్బంది అవినీతికి పాల్పడుతున్నారని ఫిర్యాదులు రావడంతో ఆయన వారిని హెచ్చరించారు. లంచాలు తీసుకోకుండా ప్రజలకు సేవ చేయాలని అధికారులచే వెంకన్న చిత్ర పటం మీద ఎమ్మెల్యే ఒట్టు వేయించారు. అయితే, అధికారులు మాత్రం తమ దారి తమదేనంటూ వ్యవహరించడంతో ఆయన మండిపడ్డారు. రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీకి ఫోన్ చేసి అవినీతికి పాల్పడిన ఇద్దరి అధికారులపై ఫిర్యాదు చేసి వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. #mla-varadarajulu-reddy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి