MLA Rapaka Varaprasad: మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావుకు అధికార పార్టీ వైసీపీ రాజోలు టికెట్ కేటాయించిన సంగతి తెలిసిందే. రాజోలు సీటు జనసేనకు కేటాయించటంతో గొల్లపల్లి టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. అయితే, ఆయనకు టికెట్ కేటాయించడంతో వైసీపీ శ్రేణుల్లో అసంతృప్తి కనిపిస్తోంది. పార్టీ కోసం కష్టపడిన నేతలు ఉండగా వేరే పార్టీ నుండి వచ్చిన వారికి టికెట్ కేటాయిస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జగన్ పునరాలోచించాలి..
తాజాగా, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజోలు వైసీపీ సీటు విషయంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి పునరాలోచించాలని పేర్కొన్నారు. మల్కిపురం సెంటర్లో వైసీపీ 14వ ఆవిర్భావ దినోత్సవ సభలో పాల్గొన్న రాజోలు ఎమ్మెల్యే రాపాక చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
Also Read: జనసేన పోటీ చేసే 21 సీట్ల లిస్ట్ ఇదే..! పవన్ పోటీ అక్కడ నుంచే..?
రాజోలు నియోజకవర్గంలో ఖచ్చితమైన సర్వే నిర్వహించి టిక్కెట్ కేటాయించాలని అన్నారు. నియోజకవర్గంలో రెండు సార్లు వైసీపీ ఓడిపోయవడంతో కార్యకర్తలు మనోవేదనతో వున్నారని..గెలిచే అభ్యర్థికి సీటు కేటాయించాలని అభర్ధించారు. తన జీవిత కాలంలో ఎన్నో పోరాటాలు చేశానని టికెట్ విషయంలో ఇక పోరాటం చేసే ఓపిక తనకు లేదంటూ మనోగతాన్ని గుర్తు చేశారు.
Also Read: నటి ఐశ్వర్య భర్త శ్యామ్ కుమార్ ఎపిసోడ్ లో ట్విస్ట్.. లైవ్ లో ఫోన్ కాల్స్ వినిపించిన భర్త..!
ఇప్పటికే తనన్ను ఎంపీగా పోటీ చేయమని చెప్పారనీ, పార్టీ అధిష్టానం ఎంపీగా పోటీ చేయమన్నా, ఎమ్మెల్యే గా పోటీ చేయమన్నా చేస్తానని..అలా కాకుండా.. ఎక్కడా సీటు లేదని అన్నా పార్టీకి సేవ చెయ్యడానికి తాను సిద్దమని చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యే రాపాక సమక్షంలోనే రాజోలు సీటు మార్చకపోతే మూకుమ్మడి రాజీనామాలు చేయడానికి సిద్ధమంటున్నారు జెడ్పీటీసీలు, ఎంపీపీలు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, వైసీపీ నాయకులు.