AP: ఎమ్మెల్యే భార్య బర్త్ డే వేడుకల్లో పాల్గొన్న పోలీసులకు షాక్..!

ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు భార్య బ‌ర్త్ డే వేడుకల్లో పాల్గొన్న పోలీసులకు ఎస్పీ శ్రీనివాసరావు షాక్ ఇచ్చారు. వారు వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసులు అందించారు. అధికారిక హోదా లేకున్నా వేడుకల్లో పాల్గొనడంపై ఎస్పీ ఈ చర్యలు తీసుకున్నారు.

AP: ఎమ్మెల్యే భార్య బర్త్ డే వేడుకల్లో పాల్గొన్న పోలీసులకు షాక్..!
New Update

Guntur: పల్నాడు జిల్లా చిలకలూరిపేట పోలీసుల తీరు వివాదస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు భార్య వెంకటకుమారి బర్త్‌ డే వేడుకల్లో పోలీసులు హడావుడి చేశారు. స్వయంగా పోలీసులే కేక్‌ తీసుకుని పుల్లారావు ఇంటికి వెళ్లి వెంకటకుమారి బర్త్‌ డేను ఘనంగా నిర్వహించారు. దీంతో పోలీసులపై తీవ్ర విమర్శలు వినిపించాయి.

Also Read: ట్రిపుల్‌ ఐటీ లో వెయ్యి మందికి పైగా విద్యార్థులకు అస్వస్థత!

చిలకలూరిపేట టౌన్‌, రూరల్‌ పీఎస్‌ సిబ్బంది, సీఐ సుబ్బనాయుడు, చిలకలూరిపేట టౌన్ ఎస్సై రమేష్, ఇతర సిబ్బంది పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్నారు. అయితే, వీరి తీరుపై ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని SP శ్రీనివాసరావు షోకాజ్ నోటీసులు అందించారు. అధికారిక హోదా లేకున్నా వేడుకల్లో పాల్గొనడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

#mla-prathipati-pulla-rao
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe