బిగ్ బాస్ హౌస్‌ నుండి బయటకి వచ్చిన ఎమ్మెల్యే..! గెంటేశారా..?

బిగ్ బాస్ హౌస్‌ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రదీప్ ఈశ్వర్ బయటికి వచ్చేశారు. కన్నడ బిగ్ బాస్ 10వ సీజన్ లో బిగ్ బాస్ ఇంట్లోకి కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రదీప్ ఈశ్వర్ ఎంట్రీ ఇచ్చారు. ఈ నేపధ్యంలో ప్రదీప్ ఈశ్వర్ పై తీవ్ర స్ధాయిలో విమర్శలు వినిపించాయి. అయితే, దీనిపై ఎమ్మెల్యే ప్రదీప్ ఈశ్వర్ స్పందించారు. కేవలం కంటెస్టెంట్లను ఉత్సాహపరిచేందుకే బిగ్ బాస్ లోకి వెళ్లి వచ్చానని ఎమ్మెల్యే వివరించారు.

బిగ్ బాస్ హౌస్‌ నుండి  బయటకి వచ్చిన ఎమ్మెల్యే..! గెంటేశారా..?
New Update

Mla Pradeep Eshwar: బిగ్ బాస్ హౌస్‌ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రదీప్ ఈశ్వర్ బయటికి వచ్చేశారు. కన్నడ బిగ్ బాస్ 10వ సీజన్ లో బిగ్ బాస్ ఇంట్లోకి కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రదీప్ ఈశ్వర్ ఎంట్రీ ఇచ్చారు. ఈ నేపధ్యంలో ప్రదీప్ ఈశ్వర్ పై తీవ్ర స్ధాయిలో విమర్శలు వినిపించాయి. అయితే, దీనిపై ఎమ్మెల్యే ప్రదీప్ ఈశ్వర్ స్పందించారు. కేవలం కంటెస్టెంట్లను ఉత్సాహపరిచేందుకే బిగ్ బాస్ లోకి వెళ్లి వచ్చానని ఎమ్మెల్యే వివరించారు.

కన్నడ బిగ్ బాస్ సీజన్-10లో కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రదీప్ ఈశ్వర్ ఎంట్రీ ఇవ్వడంపై రచ్చ..రచ్చ జరిగింది. నియోజకవర్గాన్ని పట్టించుకోకుండా బిగ్ బాస్ వంటి రియాలిటీ షోలో పాల్గొనడం ఏంటని ప్రదీప్ ఈశ్వర్ పై తీవ్ర విమర్శలు వినిపించాయి. కర్ణాటక అధికార పక్షం కాంగ్రెస్ ఈ విమర్శలకు జవాబు చెప్పలేని పరిస్థితి నెలకొంది. దీంతో ఎమ్మెల్యే ప్రదీప్ ఈశ్వర్ బిగ్ బాస్ షో నుంచి బయటికి వచ్చేశారు. తాను బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లింది కంటెస్టెంట్లను ఉత్సాహపరిచేందుకేనని ప్రదీప్ ఈశ్వర్ క్లారిటీ ఇచ్చారు. తాను కేవలం మూడు గంటల సమయం గడిపేందుకే బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లానని స్పష్టం చేశారు.

publive-image

"బిగ్ బాస్ రియాలిటీ షో నిర్వాహకుల ఆహ్వానం మేరకే ఈ కార్యక్రమానికి విచ్చేశాను. యువతకు స్ఫూర్తిదాయకంగా ఉంటుందనే ఈ షోలో పాల్గొన్నాను. అయితే కొందరు నన్ను విమర్శించారు..అది వాళ్ల ఇష్టం" అని ప్రదీప్ ఈశ్వర్ పేర్కొన్నారు. కాగా, ఎమ్మెల్యే ప్రదీప్ ఈశ్వర్ కన్నడ బిగ్ బాస్ షో 10వ సీజన్ లో పాల్గొనడం పట్ల కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ కు వందేమాతరం సామాజిక సేవా సంస్థ ఫిర్యాదు చేసింది. సదరు ఎమ్మెల్యేపై వేటు వేయాలని స్పీకర్ ను కోరింది. ప్రదీప్ ఈశ్వర్ ఇటీవలి ఎన్నికల్లో చిక్కబళ్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. గత ప్రభుత్వంలో ఆరోగ్యమంత్రిగా పనిచేసిన కె.సుధాకర్ ను ఓడించడంతో కాంగ్రెస్ వర్గాల్లో ప్రదీప్ ఈశ్వర్ కు ప్రత్యేక గుర్తింపు లభించింది.

Also Read: ఇవే తగ్గించుకుంటే మంచింది.. పల్లవి ప్రశాంత్ పై వైరల్ గా మారిన మీమ్!

#mla-pradeep-eshwar-in-bigg-boss
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe