YCP MLA: ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కు నిరసన సెగ.. ప్రచారాన్ని అడ్డుకున్న గ్రామస్థులు..! కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ప్రచారాన్ని మహిళలు అడ్డుకున్నారు. సాల్ట్ భూముల సమస్యపై గత నలభై ఆరు రోజులుగా నిరసన చేస్తున్నా ఎందుకు పట్టించుకోలేదని గ్రామస్థులు నిలదీశారు. వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. By Jyoshna Sappogula 23 Mar 2024 in ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి New Update షేర్ చేయండి MLA Ponnada Satish: కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం ముమ్మిడివరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కు నిరసన సెగ తగలింది. తాళ్లరేవు మండలం చొల్లంగి గ్రామంలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ను స్థానిక మహిళలు అడ్డుకున్నారు. సాల్ట్ భూముల సమస్యపై గత నలభై ఆరు రోజులుగా నిరసన చేస్తున్న ఎందుకు పట్టించుకోలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని పార్టీలవారు వచ్చి తమకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చినా ఎమ్మెల్యే స్థానంలో ఉంటూ కనీసం స్పందించలేదని మండిపడ్డారు. మా సమస్యలు పట్టనప్పుడు ఎన్నికల ప్రచారానికి ఎలా వస్తారంటూ వాదనకు దిగారు. Also Read: జగన్ కు బిగ్ షాక్.. పులివెందుల నుంచి పోటీలో వైఎస్ సునీత? ఎమ్మెల్యే అనుచరులు కార్యకర్తలు తమపై దౌర్జన్యం చేస్తూ తమను తోసుకుంటూ వెళ్లిపోయారని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు త్రాగునీరు సరిగ్గా రావడంలేదని, త్రాగునీటిలో జలచరాలు వస్తున్నాయని వాపోతున్నారు. వచ్చే ఎన్నికలలో తగిన రీతిలో బుద్దిచెపుతాం అంటూ స్థానిక గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు. #mla-ponnada-satish మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి