AP: ఆ నియోజకవర్గ ప్రజలకు రిలీఫ్.. డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే..!

ప్రకాశం జిల్లా గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలలో డయాలసిస్ కేంద్రాన్ని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ప్రారంభించారు. నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తామన్నారు. గిద్దలూరును అన్నివిధాల అభివృద్ధి చేస్తామని.. అందుకు సీఎం చంద్రబాబు సిద్ధంగా ఉన్నారని అన్నారు.

New Update
AP: ఆ నియోజకవర్గ ప్రజలకు రిలీఫ్.. డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే..!

MLA Muthumula Ashok Reddy: గిద్దలూరు ప్రజల ఎన్నో ఏళ్ల కలను ఎమ్మెల్యే ముత్తుమూల అశోక్ రెడ్డి నెరవేర్చారు. గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలలో డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించారు MLA అశోక్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వెనుకబడిన ప్రాంతంగా ఉన్న గిద్దలూరు నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తామన్నారు. ప్రస్తుతం ఉన్న హాస్పటల్ ని 100 పడకల హాస్పటల్ గా తీర్చి దిద్దుతామన్నారు. నియోజకవర్గాన్ని అన్నివిధాల అభివృద్ధి చేస్తామని.. అందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిద్ధంగా ఉన్నారని అన్నారు.

Also Read: RTV ట్వీట్ కు స్పందించిన ఇండియన్ రైల్వే.. నిన్న విశాఖలో జరిగిన అగ్ని ప్రమాదంపై వివరణ!

గతంలో డయాలసిస్ చేయించుకోవాలి అంటే గిద్దలూరు ప్రజలు ఎన్నో అవస్థలు పడేవారు. గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలలో డైడయాలసిస్ సెంటర్ లేకపోవడంతో బాధిత ప్రజలు మార్కాపురం గాని నంద్యాల గాని వెళ్లాసి వచ్చేది. ఎమ్మెల్యే గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలలో డయాలసిస్ కేంద్రం ప్రారంభించడంతో నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు