AP: అందుకే వచ్చిన కంపెనీలు పక్క రాష్ట్రానికి వెళ్లిపోయాయి: ఎమ్మెల్యే

గత వైసీపీ ప్రభుత్వం ప్రతి డిపార్ట్మెంట్ లోనూ పెండింగ్ బిల్స్ ఉంచారని నెలిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి ఫైర్ అయ్యారు. జగన్ తీరును చూసి వచ్చిన కంపెనీలన్నీ పక్క రాష్ట్రానికి వెళ్లిపోయాయన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కూటమితోనే సాధ్యమని ప్రజలు గెలిపించారన్నారు.

New Update
AP: అందుకే వచ్చిన కంపెనీలు పక్క రాష్ట్రానికి వెళ్లిపోయాయి: ఎమ్మెల్యే

MLA Lokam Madhavi : గత వైసీపీ ప్రభుత్వంపై విజయనగరం జిల్లా నెలిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. RTVతో ఆమె మాట్లాడుతూ.. ప్రతి డిపార్ట్మెంట్ లోనూ వైసీపీ ప్రభుత్వం పెండింగ్ బిల్స్ ఉంచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని దోచుకోవడమే తప్పా చేసిన అభివృద్ధి శూన్యం అని మండిపడ్డారు. గత ఐదేళ్ల కాలంలో జగన్ తీరును చూసి వచ్చిన కంపెనీలన్నీ పక్క రాష్ట్రానికి వెళ్లిపోయాయన్నారు. ఆసరా పెన్షన్ విషయంలోనూ గత ప్రభుత్వం చాలా అవినీతి చేసిందని ఆరోపించారు.

Also Read: మాజీ మంత్రి కొడాలి నానికి బిగ్ రిలీఫ్..ఏపీ హైకోర్టులో ఊరట.!

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అవ్వాలి అంటే కూటమితోనే సాధ్యమని ప్రజలు నమ్మారని.. అందుకే ఎన్నికల్లో ఘన విజయం అందించారని పేర్కొన్నారు. టీడీపీ, జనసేన అధినేతలు ఇద్దరు సంపద సృష్టించే దిశగా అడుగులు వేస్తున్నారని వ్యాఖ్యానించారు. పది సంవత్సరాలపాటు ఈ కూటమి కలిసి నడుస్తుందని.. అప్పుడే ఆంధ్రప్రదేశ్ దేశంలో నెంబర్ వన్ గా ఉంటుందని కామెంట్స్ చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు