MLA KTR: ఆరు గ్యారెంటీలు కాదు.. ఆరుగురు ఎమ్మెల్యేలు.. కాంగ్రెస్‌పై కేటీఆర్ ఫైర్

TG: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలను అమలు చేయకుండా బీఆర్ఎస్ నుంచి ఆరుగురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను చేర్చుకుందని అన్నారు కేటీఆర్. కాంగ్రెస్ చెప్పేది ఒకటి చేసేది ఇంకోటి అని చురకలు అంటించారు. ఫిరాయింపులపై సుప్రీం కోర్టుకు పోతామని చెప్పారు.

MLA KTR:  రుణమాఫీతో రైతులను మోసం చేస్తోంది..  రేవంత్ సర్కార్‌పై  కేటీఆర్ ఫైర్
New Update

MLA KTR: కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ చెప్పేది ఒకటి, చేస్తుంది ఒకటి అని అన్నారు. రాజ్యాంగం అంటున్నారు.. కానీ రాజ్యాంగాన్ని ఫాలో కావడం లేదని చురకలు అంటించారు. తెలంగాణలో ఆరు గ్యారెంటీ లు అమలు చేస్తాం అని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ప్రజలకు ఎన్నికల్లో కాంగ్రెస్ సినిమా చూపెట్టిందని సెటైర్లు వేశారు. రాహుల్ స్వయంగా వచ్చి.. ప్రజలకు హామీ ఇచ్చారని అన్నారు.

నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఒకటి కాదు రెండు కాదు 420 హామీలు ఇచ్చారని గుర్తు చేశారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చాక ఒక్క హామీ కూడా కాంగ్రెస్ అమలు చెయ్యలేదని.. కానీ ఆరుగురు ఎమ్మెల్యేలను, ఆరుగురు ఎమ్మెల్సీలను, ఒక రాజ్యసభ ఎంపీని తీసుకొనిపోయారని అన్నారు. రాజ్యాంగం అంటున్న కాంగ్రెస్ చేస్తోంది ఏంటి? అని నిలదీశారు. బీజేపీ ఇతర పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకుంటే.. వాళ్ళు అనైతికంగా వ్యవహరిస్తున్నారు అని కాంగ్రెస్ ఆరోపిస్తోందని అన్నారు. కానీ తెలంగాణ లో కాంగ్రెస్ చేస్తోంది ఏంటి? అని ప్రశ్నించారు. తెలంగాణ సమాజం మొత్తం కాంగ్రెస్ వైఖరిని గమనిస్తోందన్నారు. పార్టీ ఫిరాయింపులపై ఇప్పటికే తెలంగాణ హైకోర్టులో విచారణ జరుగుతోందని.. దీనిపై సుప్రీం కోర్టుకు కూడా వెళ్తామని చెప్పారు.

#brs-mla-ktr
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe