AP: గేట్ల నిర్వహణ సరిగ్గా లేదు.. అందుకే ఇలా జరిగింది: ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు మానవ తప్పిదంతోనే తుంగభద్ర డ్యామ్ గేటు ధ్వంసమైందని ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు అన్నారు. ప్రమాదం పొంచి ఉంది కాబట్టి ప్రత్యామ్నాయ గేటు ఏర్పాటు చేసుకోవాలని సాగునీటి రంగ నిపుణులు హెచ్చరించినప్పటికీ తుంగభద్ర బోర్డు అధికారులు పట్టించుకోలేదని ఆరోపించారు. By Jyoshna Sappogula 11 Aug 2024 in ఆంధ్రప్రదేశ్ అనంతపురం New Update షేర్ చేయండి MLA Kalava Srinivasulu: తుంగభద్ర జలాశయం 19వ గేటు కొట్టుకుపోవడం ఎంతో బాధాకరమన్నారు ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు. ఈ ఘటనపై హెచ్ ఎల్ సి ఆయకట్ట రైతన్నల్లో ఆందోళన నెలకొందన్నారు. 60 టీఎంసీలకు పైగా నీరు వృధాగా నదులకు వెళ్లే అవకాశం ఉందన్నారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, సంబంధిత అధికారులతో ఎలాగైనా గేటును ఏర్పాటు చేసి నీటి నిల్వను తగ్గకుండా చూడాలని కోరామన్నారు. Also Read: రూ.113 కోట్లతో 160 దేవాలయాలు పునర్నిర్మిస్తాం: మంత్రి ఆనం మానవ తప్పిదంతోనే తుంగభద్ర డ్యామ్ 19వ గేటు ధ్వంసమైందని ఎమ్మెల్యే అన్నారు. గేట్ల నిర్వహణ సరిగ్గా లేదన్నారు. రెండు ఏజెన్సీలతో గేటు పునరుద్ధరణ పనులు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. తుంగభద్ర నుంచి 60 టీఎంసీల నీరు దిగువకు వదిలితే రాయలసీమకు తీరని నష్టం జరుగుతుందన్నారు. Also Read: రోడ్డు ప్రమాదం కాదు.. కావాలనే నేనే ఇలా చేశా.. దివ్వల మాధురి సంచలన వ్యాఖ్యలు.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, నీటి జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామ్మోహన్ నాయుడును అప్రమత్తం చేయడంతో పాటు తగు సూచనలు జారీ చేయడం జరిగిందన్నారు. గేట్లకు ఎంత డబ్బులు ఖర్చయిన తక్షణమే నిధులు ఇచ్చి ప్రత్యామ్నాయ గేట్లను ఏర్పాటు చేసేలా చూడాలని చంద్రబాబు ఆదేశించినట్టు తెలిపారు. #mla-kalava-srinivasulu మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి