AP: ఎమ్మెల్యే చింతమనేని అనుచరులు హల్‌చల్ .. తెలంగాణ వ్యక్తులపై దాడి..! ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఎమ్మెల్యే చింతమనేని అనుచరులు హల్‌చల్ చేశారు. తెలంగాణకు చెందిన వ్యక్తులు గుబ్బల మంగమ్మ గుడి దర్శనానంతరం అక్కడే విందు ఏర్పాటు చేసుకున్నారు. అదే ప్రాంతంలో విందు కార్యక్రమంలో ఉన్న దెందులూరు ఎమ్మెల్యే అనుచరులు మద్యం మత్తులో వారిని చితకబాదారు. By Jyoshna Sappogula 04 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి MLA Chintamaneni: ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం గుబ్బల మంగమ్మ గుడి వద్ద దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని అనుచరులు హల్‌చల్ చేశారు. తెలంగాణకు చెందిన వ్యక్తులను చితకబాదారు. గుబ్బల మంగమ్మ గుడికి మొక్కులు చెల్లించుకోవడానికి తెలంగాణాకు చెందిన గాండ్లగూడెం, అచ్చుతాపురం గ్రామాలకు చెందిన పలువురు గ్రామస్తులు అక్కడికి వచ్చారు. అయితే, దర్శనానంతరం అక్కడే విందు ఏర్పాటు చేసుకున్నారు. ఇరువర్గాల దాడి.. అయితే, అదే ప్రాంతంలో విందు కార్యక్రమంలో ఉన్న దెందులూరు నియోజకవర్గం పెదపాడుకు చెందిన పలువురు చింతమనేని అనుచరులు.. మద్యం మత్తులో తెలంగాణా వాసులతో వాగ్వాదానికి దిగారు. ఘర్షణలో తెలంగాణాకు చెందిన వ్యక్తి బైక్ ను ధ్వంసం చేశారు. వివాదం ముదరడంతో ఇరువర్గాలు దాడికి పాల్పడ్డారు. Also Read: వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి షాక్.! తీవ్ర గాయాలు.. "మేము దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తాలూకా ఏం చేసుకుంటావో చేస్కో" అంటూ చింతమనేని అనుచరుడు రెచ్చిపోయాడు. తెలంగాణాకు చెందిన వ్యక్తులను విచక్షణారహితంగా కర్రలు, రాళ్ళ తో దాడి చేసి తలలు పగలగొట్టారు చింతమనేని అనుచరులు. దాడిలో తెలంగాణాకు చెందిన 8 మందికి తీవ్ర గాయాలు అయ్యారు. హుటాహుటిన అశ్వారావుపేటలోని ఓ ప్రయివేట్ ఆసుపత్రికి వారిని తరలించారు. 60 మందికి పైగా.. పలువురు దెందులూరు వాసులకూ సైతం గాయాలు అయ్యాయి. మొత్తం 60 మందికి పైగా ఈ ఘర్షణలో ఉన్నట్టు సమాచారం. విషయం బయటకు రాకుండా సెటిల్మెంట్ చేసుకొని ఎవరికి వారు జారుకున్నారు. అయితే ఇంత జరిగినా తమకు కంప్లైంట్ ఏమీ రాలేదని చెబుతోన్నారు బుట్టాయిగూడెం పోలీసులు. ప్రస్తుతం దాడికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి. #latest-news-in-telugu #mla-chintamaneni మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి