MLA Bolisetti Srinivas : మెగా, అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య ట్విట్టర్‌లో రచ్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు కేవలం మెగా ఫ్యాన్స్ ఉన్నారని మాత్రమే తెలుసు తప్పా.. అల్లు అర్జున్ కు ప్రత్యేకంగా ఫ్యాన్స్ ఉన్నారని తెలియదని ఎద్దేవా చేశారు. తనకు ఫ్యాన్స్ ఉన్నారని అల్లు అర్జున్ ఊహించుకుంటున్నాడని సెటైర్లు వేశారు.
Also Read: తాడిపత్రిలో హైటెన్షన్.. ఎమ్మెల్యే జేసీ అస్మిత్ V/s సీఐ లక్ష్మీకాంత్‌రెడ్డి..!
అల్లు అర్జున్ తన స్థాయి మరచి మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. చాలా జాగ్రత్తగా మాట్లాడాలని అల్లు అర్జున్ కు సూచించారు. కేవలం హీరో చిరంజీవి వల్లే అల్లు అర్జున్ ను మెగా అభిమానులు హీరోగా గుర్తించారన్నారు. అల్లు అర్జున్ తానేదో పుడింగి లాగా ఫీల్ అయి.. ఇష్టం అయితే వస్తా.. లేదంటే లేదు అంటే.. ఇక్కడా బతిమాలాడే వాళ్లు ఎవరూ లేరన్నారు.
అల్లు అర్జున్ ప్రచారానికి వస్తే ఎంత.. రాకపోతే ఎంత.. అంటూ ఫైర్ అయ్యారు. జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లోనూ గెలిచిందని.. అల్లు అర్జున్ ప్రచారానికి వెళ్లిన ఒక్క చోట కూడా గెలవలేకపోయారని కౌంటర్లు వేశారు. తండ్రి అల్లు అరవింద్ ఎంపీగా నిలబడితే గెలిపించలేని అల్లు అర్జున్ ఇప్పుడు ఇతరులపై విమర్శలు చేయడం ఏంటని ధ్వజమెత్తారు.