/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/MLA-Dance-jpg.webp)
MLA Madhusudan Reddy Dance: ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యేలందరూ ఒక ఎత్తైతే.. ఈ ఎమ్మెల్యే ఒక్కరు ఒక ఎత్తు. ఎందుకంటే.. ఆయన ఏం చేసినా వినూత్నమే. నిత్యం ప్రజలతో మమేకమయ్యే ఆ ఎమ్మెల్యే.. వారి సంతోషం, సంబరాల్లోనూ పాలుపంచుకుంటారు. ఏ కార్యక్రమం అయినా ముందుంటారు. జనంలో ఎప్పుడూ సందడి చేసే నైజమున్న ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ తానొక ప్రత్యేకమని చాటే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. తన ఆహభావాలతో, మాటలతో జోకులేసి జనాన్ని ఆకర్షించే ప్రయత్నం చేసే బియ్యపు మధుసూదన్ రెడ్డి గ్రామాల్లో గడపగడప కార్యక్రమాల్లో తనదైన శైలిలో తిరుగుతున్నారు.
తాజాగా తన నియోజకవర్గం పరిధిలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. పులి వేషం వేసుకున్న ఆటగాళ్లతో చిందులేశారు. వేషగాళ్లను మించిన జోష్, ఉత్సాహంతో డ్యాన్స్ చేశారు. ఆయన ఉత్సాహం, జోష్, డ్యాన్స్ చూసి జనాలే షాక్ అయ్యారు. కాగా, ఎమ్మెల్యే డ్యాన్స్‌కు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఇప్పుడే కాదు.. గతంలో అనేక సందర్భాల్లోనూ ఇలాగే డ్యాన్స్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ప్రజా కార్యక్రమాల్లో పాల్గొంటూ.. ప్రజల్లో జోష్ నింపే ప్రయత్నం చేస్తారాయన. మరెందుకు ఆలస్యం.. ఎమ్మెల్యే పులి డ్యాన్స్‌పై మీరూ ఓ లుక్కేసుకోండి..
Also Read: