Vasundhara: ఎమ్మెల్యే బాలకృష్ణ పోటీపై ఆయన సతీమణి వసుంధర కీలక వ్యాఖ్యలు..!

హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమంటున్నారు ఆయన సతీమణి వసుంధర. నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని టీడీపీ శ్రేణుల్లో జోష్ నింపారు. బాలకృష్ణ హయాంలోనే హిందూపురం అభివృద్ధి జరిగిందని ఆమె వ్యాఖ్యానించారు.

Vasundhara: ఎమ్మెల్యే బాలకృష్ణ పోటీపై ఆయన సతీమణి వసుంధర కీలక వ్యాఖ్యలు..!
New Update

MLA Balakrishna wife Vasundhara: హిందూపురంలో సినీ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమంటున్నారు ఆయన సతీమణి వసుంధర. 2024 అసెంబ్లీ ఎన్నికల కోసం మరోసారి హిందూపురం నుంచే బాలకృష్ణ బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే హిందూపురం నియోజకవర్గంలో పర్యటించారు బాలకృష్ణ భార్య వసుంధరా దేవి. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటూ టీడీపీ శ్రేణుల్లో జోష్ నింపారు. ఒక రకంగా బాలయ్య తరుఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారని నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది. బాలకృష్ణ హయాంలోనే హిందూపురం అభివృద్ధి జరిగిందని ఆయన వసుంధరా దేవి చెప్పారు.

Also Read: ఎండాకాలంలో చల్లచల్లని బాదాం మిల్క్ ఎంతో మేలు.. ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి..!

బాలకృష్ణ ఎమ్మెల్యేగా ఉన్నసమయంలోనే గతంలో ఆస్పత్రిని అభివృద్ధి చేసినట్లు ఆయన భార్య వసుంధర గుర్తు చేశారు. అలాగే మొబైల్ఆ రోగ్య సేవలు, క్యాన్సర్ చికిత్స అందించిన ఘనత బాలకృష్ణదేనన్నారు. పేదల కోసం ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ ఇప్పటికీ కొనసాగుతుందని గుర్తు చేశారు. హిందూపురం అభివృద్ధికి బాలకృష్ణ చేసిన సేవలకు గుర్తింపుగా మరోసారి ఆయన గెలవడం ఖాయమని వసుంధర ధీమా వ్యక్తం చేశారు.

Also Read: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు పోటీగా డైరెక్టర్ ఆర్జీవీ.. !

2014లో రాజకీయ అరంగేట్రం చేశారు నందమూరి బాలకృష్ణ. గతంలో సీనియర్ ఎన్టీఆర్ ప్రాతినిథ్యం వహించిన హిందూపురం నుంచే తొలిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచి ఘన విషయం సాధించి తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లోనూ మరోసారి బాలయ్య హిందూపురంలో విజయం సాధించారు. ఈ నేపథ్యంలోనే ఈ సారి కుప్పం, హిందూపురం నియోజకవర్గాలపై వైసీపీ అధిష్టానం స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నేతృత్వంలో చంద్రబాబు, బాలకృష్ణలను ఓడించేందుకు ప్లాన్స్ వేస్తోంది. ఈ సారి కూడా హిందూపురం ప్రజల ఆశీర్వాదంతో బాలయ్య హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని ఆయన భార్య వసుంధరా దేవి ధీమా వ్యక్తం చేస్తున్నారు. బాలయ్య విజయాన్ని ఆపడం కష్టమని వార్తలు వినిపిస్తున్నాయి.

#vasundhara #mla-balakrishna
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe