MLA Chanti : అధికార బలంతో ఇలా చేశారు: ఎమ్మెల్యే చంటి

అధికార బలంతో ఏలూరులో వైసీపీ కార్యాలయాన్ని ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మించారన్నారు ఎమ్మెల్యే బడేటి చంటి. ప్రభుత్వం వైసీపీ కార్యాలయాన్ని స్వాధీనం చేసుకుంటుందని తేల్చిచెప్పారు. ఈ కట్టడాన్ని ప్రభుత్వ కార్యాలయాలకు కానీ, జూనియర్‌ కళాశాలలకు కానీ, వసతి గృహాలకు కానీ వినియోగిస్తామన్నారు.

New Update
MLA Chanti : అధికార బలంతో ఇలా చేశారు: ఎమ్మెల్యే చంటి

MLA Badeti Chanti : అధికార బలంతో ఏలూరులో వైసీపీ కార్యాలయాన్ని ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మించారని మండిపడ్డారు ఎమ్మెల్యే బడేటి చంటి. ఈ కార్యాలయాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని తేల్చి చెప్పారు. అనుమతులు లేకుండా ఏలూరులో నిర్మించిన వైసీపీ కార్యాలయాన్ని ఆయన సందర్శించి మాట్లాడారు.

Also Read: ఎవ్వరు తప్పు చేసినా క్రిమినల్ కేసులే.. మంత్రి నాదెండ్ల మనోహర్ హెచ్చరిక..!

‘వైసీపీ కార్యాలయాన్ని నిర్మించిన స్థలాన్ని 2006లో డాన్‌ అనే కంపెనీకి కమర్షియల్‌ కాంప్లెక్స్‌కు అప్పటి ప్రభుత్వం కేటాయించింది. అనంతరం ఆ కంపెనీతో అగ్రిమెంట్‌ క్యాన్సిల్‌ చేయకుండా గత ప్రభుత్వ హయాంలో ఆ స్థలంలో వైసీపీ కార్యాలయ నిర్మాణం చేపట్టారు. ఇందుకు నగర పాలక సంస్థ ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌ నుంచి 33 ఏళ్లకు ఎకరానికి రూ.వెయ్యి ఇచ్చే విధంగా లీజుకు తీసుకున్నారు. తక్షణం వైసీపీ కార్యాలయాన్ని స్వాధీనం చేసుకోవాలి’ అని కమిషనర్‌ వెంకటకృష్ణను ఆదేశించారు.

Advertisment
తాజా కథనాలు