Aishwarya: IAS అయిన మిస్ ఇండియా ఫెమినా.. కోచింగ్ లేకుండానే UPSC క్రాక్‌ చేసిన బ్యూటీ..!

తన తల్లి కలను నెరవేర్చడానికి ఓ అమ్మాయి మోడలింగ్‌కు గుడ్‌బై చెప్పి UPSC క్రాక్‌ చేసింది. ఆమె మిస్ ఇండియా ఫెమినా కూడా. అయితే, అసలు ఆ అమ్మాయి ఎవరూ, ఎలాంటి కోచింగ్ లేకుండానే తొలి ప్రయత్నంలోనే ఎలా క్వాలిఫై అయిందో తెలుసుకోవడానికి ఆర్టికల్ లోకి వెళ్లండి.

Aishwarya: IAS అయిన మిస్ ఇండియా ఫెమినా.. కోచింగ్ లేకుండానే UPSC క్రాక్‌ చేసిన బ్యూటీ..!
New Update

Aishwarya sheoran: దేశంలోనే అత్యంత కఠినమైన పరీక్షల్లో యూపీఎస్సీ ఒకటి. అందులో ఉత్తీర్ణత సాధించేందుకు అభ్యర్థులు 14-15 గంటల పాటు కష్టపడి చదువుతారు. కొంతమంది అభ్యర్థులు ఓ జాబ్‌ చేస్తూ మరోవైపు UPSCకి సిద్ధమవుతారు. ఇంకొంతమంది తమ ఉద్యోగాలను వదిలి పరీక్షకు ప్రిపేర్ అవుతారు. ఇక తన తల్లి కలలను నెరవేర్చడానికి మోడలింగ్‌కు గుడ్‌బై చెప్పి UPSC క్రాక్‌ చేసిన అమ్మాయి గురించి తెలుసుకుందాం..

Also Read: ప్రియుడి కోసం ముగ్గురు పిల్లల తల్లి ఏం చేసిందో చూడండి

2018లో యూపీఎస్సీ పరీక్షలో తొలి ప్రయత్నంలోనే ఉత్తీర్ణత సాధించారు ఐఏఎస్ ఐశ్వర్య షెరాన్. ఆమె మిస్ ఇండియా ఫెమినా కూడా. ఐశ్వర్య చిన్నప్పటి నుంచి చదువులో చాలా తెలివైనది. ఢిల్లీలోని చాణక్యపురిలోని సంస్కృతి పాఠశాలలో పాఠశాల విద్యను పూర్తి చేశారు. అలాగే 12వ తరగతి పరీక్షలో 97.5 శాతం మార్కులు సాధించి టాప్‌ ర్యాంక్‌లో నిలిచారు. 2014లో ఫెమినా మిస్ ఇండియా పోటీలో పాల్గొని ఫైనలిస్ట్‌గా నిలిచింది. అయితే ఆ తర్వాత ఆమె తన మోడలింగ్ వృత్తిని విడిచిపెట్టి, UPSC కోసం ప్రిపేర్ అయ్యారు. ఐశ్వర్య 2018లో CAT పరీక్షను క్రాక్‌ చేసింది. అయినా ఆమె అడ్మిషన్ తీసుకోలేదు.

Also Read: తులసి ఆకుల్లో దీన్ని కలిపి రాస్తే .. వద్దన్నా.. జుట్టు పెరుగుతుంది..!

ప్రముఖ బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ బచ్చన్ పేరు మీద ఐశ్వర్య తల్లి ఆమెకు పేరు పెట్టారు. తన మోడలింగ్ వృత్తిని విడిచిపెట్టి, ఐశ్వర్య 10 నెలలు ఇంట్లోనే ఉండి UPSC కోసం సిద్ధమైంది. ఎలాంటి కోచింగ్ లేకుండానే యూపీఎస్సీ పరీక్షలో తొలి ప్రయత్నంలోనే క్వాలిఫై అయయింది. తొలి ప్రయత్నంలోనే 93వ ర్యాంక్‌ సాధించింది. సోషల్ మీడియాలో ఐశ్వర్య యాక్టివ్‌గా ఉంటారు. అందంలో ఏ హీరోయిన్‌కు తక్కువ కాకుండా కనిపించే ఆమెకు లక్షల సంఖ్యలో ఫాలోయిర్లు ఉన్నారు.

#aishwarya-sheoran
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe