Miracle : చనిపోయి ఐదేళ్లయినా చెక్కుచెదరకుండా శరీరం.. సైంటిస్టులకే సవాల్! డెడ్ బాడీ రెండు రోజుల్లోనే వాసన వచ్చేస్తుంది. కానీ, మిస్సౌరీలోని కాన్సాస్ సిటీకి చెందిన 2019లో 95 ఏళ్ల వృద్ధురాలు మరణించింది. అయితే ఐదేళ్ల తర్వాత కూడా ఆమె మృతదేహం కుళ్లిపోలేదు. ఆ శవాన్ని పూడ్చిపెట్టినా అది మునుపటిలానే ఉంది. ఇది శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యపరిచింది. By KVD Varma 25 Aug 2024 in ఇంటర్నేషనల్ ట్రెండింగ్ New Update షేర్ చేయండి Miracle : ఎవరైనా చనిపోతే వెంటనే అంతిమ సంస్కారం చేసేయాల్సిందే. లేదంటే సమయం గడిచే కొద్దీ మృతదేహం కుళ్లిపోవడం మొదలవుతుంది. దుర్వాసన వెదజల్లుతుంది. చనిపోయినవారి బంధువుల ఆఖరి చూపుల కోసం ఒక్కోసారి రెండు లేదా మూడు రోజుల పాటు మృతదేహాన్ని ఉంచాల్సి వస్తే ఫ్రీజర్ లో ఉంచుతారు. ప్రమాదాలు జరిగిన సమయంలో సంబంధీకులకు బాడీని అప్పచెప్పేవారుకూ మార్చురీలో పూర్తి కూల్ లో బాడీని భద్రపరుస్తారు. ఏదైనా మృతదేహాన్ని పరిశోధనల కోసం ఎప్పుడైనా కొన్నిరోజులు ఉంచాలి అనుకుంటే, దానికి కెమికల్ ట్రీట్మెంట్ ఇచ్చి భద్రపరుస్తారు. ఎందుకంటే, మృతదేహం పాడవకుండా ఉండడంతో పాటు.. బయట నుంచి చీమలు వంటి క్రిమికీటకాలు మృతదేహాన్ని ఛిద్రం చేయకుండా ఉంచడం కోసం అలా చేయడం తప్పనిసరి. కానీ, ఎటువంటి రసాయనాలు పూయకుండా.. కేవలం ఒక చెక్క పెట్టెలో పెట్టిన మృత దేహం ఐదేళ్లయినా చెక్కుచెదరకుండా ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. సైంటిస్టులు కూడా దీని వెనుక కారణాన్ని తెలుసుకోలేకపోయారు. Miracle: ఆధునిక యుగంలో అద్భుతంగా చెప్పుకుంటున్న ఈ ఆశ్చర్యకర సంఘటన మిస్సౌరీలోని కాన్సాస్ సిటీలో చోటు చేసుకుంది. అక్కడి సిస్టర్ విల్హెల్మినా లాంకాస్టర్ మే 29, 2019న 95 ఏళ్ల వయసులో మరణించారు. ఆమెను అక్కడి మోలోని అపోస్టల్స్ మానస్ట్రీ లో గోవర్ సమాధిలో రోజుల వ్యవధిలోనే ఖననం చేశారు. దీని కోసం ఒక సాధారణ సీలు చేయని చెక్క పేటికను ఉపయోగించారు. నాలుగేళ్ల తరువాత ఏప్రిల్ 2023లో ఆమె పార్థివదేహానికి చర్చిలో అంతిమ సంస్కారాలు చేయడం కోసం సమాధి నుంచి శవపేటికను వెలికి తీశారు. ఆ చెక్క పేటిక చాలా వరకూ పాడైపోయింది. కానీ, అందులోని విల్హెల్మినా లాంకాస్టర్ మృత దేహం ఏమాత్రం చెక్కు చెదరకుండా.. గాఢ నిద్రలో ఉన్నట్లు కనిపించింది. దీంతో అందరూ ఆశ్చర్యపోయారు. Miracle: ఈ సంఘటన సంచలనం సృష్టించడంతో పాటు.. ఈ వింతను చూడటానికి విపరీతంగా ప్రజలు వచ్చి చేరుతుండడంతో డియోసెస్ ఆఫ్ కాన్సాస్ సిటీ-. బిషప్ జేమ్స్ V. జాన్స్టన్, Jr. సెయింట్ జోసఫ్ మే 24, 2023న శరీరాన్ని పరీక్షించి, విషయాన్ని అధ్యయనం చేయడానికి స్థానిక వైద్య నిపుణుల బృందాన్ని నియమించారు. ఈ బృందానికి డాక్టర్ ఆఫ్ పాథాలజీ నాయకత్వం వహించారు. వీరికి మరో ఇద్దరు వైద్య వైద్యులు, మాజీ మిస్సౌరీ కౌంటీ కరోనర్ సహాయం అందించారు. మరణించినవారి మృత దేహాలను పరిశీలించడం అలాగే అధ్యయనం చేయడంతో పాటు ఈ బృందం పేటికను పరిశీలించింది. 2019లో ఖననం - 2023 ఏప్రిల్‌లో త్రవ్వకానికి ముందు జరిగిన సంఘటనలకు ప్రత్యక్ష సాక్షులతో ఇంటర్వ్యూలు కూడా నిర్వహించారు. BREAKING: Bishop issues statement on the medical examination of Sister Wilhelmina's body. Most Reverend Bishop James V. Johnston, Diocese of Kansas City-St. Joseph, releases results of examination and evaluation by medical experts concerning the remains of Sister Wilhelmina… pic.twitter.com/wIWTvL9WgF — Incorruptible (@catholicxyz) August 22, 2024 Miracle: ఈ పరీక్షల్లో చెక్క పేటిక శిథిలావస్థకు చేరుకుంది. కానీ, విల్హెల్మినా శరీరం మాత్రం చెక్కు చెదరలేదు. అంతేకాదు, ఆమె శరీరంపై ఉన్న దుస్తులు కూడా ఏమాత్రం పాడలేదు. అయితే, చెక్క పేటికకు అలంకరణ కోసం ఉపయోగించిన గుడ్డలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. దీంతో ఈ వైద్యబృందం కూడా ఆశ్చర్యపోయింది. అదేవిధంగా ఆ శవపేటికలో మృతదేహాన్ని శిధిలం కాకుండా ఉంచేందుకు ఎటువంటి రాసాయనాలు ఉపయోగించిన ఆనవాళ్లు కూడా దొరకలేదని వైద్య బృందం నిర్ధారించింది. నిపుణుల బృందం ఇటీవల తమ నివేదికను సమర్పించింది ఆ నివేదికలో మృతదేహం ఇంకా ఎందుకు కుళ్ళిపోలేదనే దానిపై ఎటువంటి నిర్ధారణకు రాలేకపోయామని బృందం తేల్చి చెప్పింది. మొత్తమ్మీద ఈ సంఘటన ఆ ప్రాంతంలో సంచలనం సృష్టించింది. ఈ విషయాన్ని X వేదికగా బిషప్ బిషప్ జేమ్స్ V. జాన్స్టన్ షేర్ చేశారు. ఈ ట్వీట్ ను చూసిన నెటిజన్లు కూడా ఆశ్చర్యపోతూ.. వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. Also Read : మీ ఆధార్ కార్డు మిస్ యూజ్ అవుతోందని డౌటా? ఇంటి నుంచే తెలుసుకోండిలా! #miracle మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి