AP: రోడ్డు సేఫ్టీ అవగాహన పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి!

విజయవాడలో రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి రోడ్డు సేఫ్టీ అవగాహనపై పోస్టర్ ఆవిష్కరించారు. రోడ్డు ప్రమాదాల నివారణ అందరి బాధ్యత అన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెంట్‌ పెట్టుకోవాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని.. ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలని కోరారు.

New Update
AP: రోడ్డు సేఫ్టీ అవగాహన పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి!

Vijaywada: విజయవాడ క్యాంప్ కార్యాలయంలో రోడ్ సేఫ్టీ స్వచ్ఛంద సంస్థ వారి రోడ్డు భద్రతా పోస్టర్లను రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలు అత్యంత విషాదకరమైన సంఘటనలన్నారు. దీని నివారించడానికి ప్రజలలో విస్తృత స్థాయిలో ప్రచారం చేయడానికి స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలన్నారు.

Also Read: పైన ఇసుక.. లోన గంజాయ్.. పుష్పాను బీట్ చేస్తున్న స్మగ్లర్లు..!

రోడ్డు భద్రత పోస్టర్ల ద్వారా మద్యం సేవించి వాహనాలు నడపరాదని,హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని కోరారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రోడ్ సేఫ్టీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షురాలు ఆర్కే దుర్గ పద్మజ, సభ్యులు వెంకటేశ్వరరావు, బంగారయ్య తదితరులు పాల్గొన్నారు.

Also Read: ఏపీ హోంమంత్రి అనితకు తృటిలో తప్పిన ప్రమాదం!

రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. తద్వారా వాహనాలు నడిపేటప్పుడు పాటించాల్సిన నిబంధనలను పోస్టర్ల ద్వారా వివరిస్తున్నారు. బైక్ నడిపే సమయంలో తప్పనిసరిగా హెల్మెంట్‌ పెట్టుకోవాలని.. కార్లు నడిపే వాహనదారులు సీట్‌బెల్ట్‌ పెట్టుకోవాలని అవగాహన కల్పిస్తున్నారు. ముఖ్యంగా మద్యం తాగి వాహనాలు నడిపితే కలిగే నష్టాలపై సైతం వివరిస్తున్నారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం.

Advertisment
తాజా కథనాలు