Vijayawada: విజయవాడలో అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులను పరిశీలించారు మంత్రి మేరుగ నాగార్జున, మంత్రి కొట్టు సత్యనారాయణ. ఆనంతరం మాట్లాడుతూ.. లోకేష్ పై నిప్పులు చెరిగారు. అసలు లోకేష్ ఎవరూ.? ఎమ్మెల్యే నా, ఎవరు.. అంటూ ప్రశ్నించారు. అంబేద్కర్ పేరు ఉచ్ఛరించడానికి కూడా లోకేష్, అతని కుటుంబం పనికిరారని ధ్వజమెత్తారు. ముళ్ళపొదల్లో అంబేద్కర్ విగ్రహం పెట్టాలని చూసి దళితులను అపహాస్యం చేసిన వ్యక్తిగా చంద్రబాబు మిగులుతారని విమర్శలు గుప్పించారు.
Also read: రైతుబంధు ఆగిపోవడంపై స్పందించిన రేవంత్ రెడ్డి.. ఏమన్నారంటే
ఈ క్రమంలోనే సీఎం జగన్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఏపీ చరిత్రలో సామాజిక సమతుల్యత కోసం సీఎం అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులను చేస్తున్నారన్నారు. సామాజిక విప్లవానికి నిదర్శనమే అంబేద్కర్ విగ్రహం నిర్మాణమని..అంబేద్కర్ చరిత్ర ఈ నిర్మాణంలో తెలుస్తుందిని తెలిపారు. త్వరలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ప్రారంభిస్తామని వెల్లడించారు.
Also Read : అతనే రైతుబంధు ఆపాలని ఈసీఐకి ఫిర్యాదుచేశారు.. హరీష్ రావు ఫైర్..
ఆనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడారు. అంబేద్కర్ జీవిత చరిత్ర చెప్పే స్టూడియో, మినీ థియేటర్ కూడా ఇందులో ఉంటాయని వ్యాఖ్యనించారు. బౌద్ధ మతాన్ని అంబేద్కర్ స్వీకరించిన నాటి వివరాలు ఈ స్మృతివనంలో ఉంటాయని తెలిపారు. అంబేద్కర్ భావజాలాన్ని సీఎం జగన్ పరిపాలనా తీరులో చూడవచ్చన్నారు. వేలకోట్లు ఇచ్చినా ఇలాంటి స్ధలం నిర్మాణానికి దొరకదన్నారు. ఏ వర్గాన్ని విస్మరించకుండా అన్నిరకాల సహకారం అందిస్తున్నా ముఖ్యమంత్రి జగన్ అని కొనియాడారు.