కేసీఆర్‌ను వదులుకుంటే.. తెలంగాణ నాశనమే..

కేసీఆర్‌ లాంటి గొప్ప నాయకుడు, సంక్షేమ సారథిని తెలంగాణ ప్రజలు వదులుకోరని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. తెలంగాణ ప్రజలు తెలివిగల వారని వారి భవిష్యత్‌ను వారే అంధకారంలోకి నెట్టుకోరని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందన్నది ఊహాగానాలేనని.. ఆ పార్టీ నాయకులు పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. 90కి పైగా స్థానాల్లో బీఆర్‌ఎస్‌ విజయఢంకా మోగిస్తుందని స్పష్టం చేశారు.

New Update
కేసీఆర్‌ను వదులుకుంటే.. తెలంగాణ నాశనమే..

కేసీఆర్‌ లాంటి గొప్ప నాయకుడు, సంక్షేమ సారథిని తెలంగాణ ప్రజలు వదులుకోరని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. తెలంగాణ ప్రజలు తెలివిగల వారని వారి భవిష్యత్‌ను వారే అంధకారంలోకి నెట్టుకోరని సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం నాడు ఆర్టీవీకి ఎక్స్‌క్లూజివ్‌ ఇంటర్యూ ఇచ్చారు. కాంగ్రెస్‌ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని మండిపడ్డారు. కాంగ్రెస్‌ గ్యారెంటీల గురించి ప్రజలెవ్వరూ పట్టించుకోవడం లేదన్నారు. అధికారం కోసం కొట్టుకోవడమే తప్ప కాంగ్రెస్‌ నేతలకు అభివృద్ధి చేతకాదని విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందన్నది ఊహాగానాలేనని.. ఆ పార్టీ నాయకులు పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. 90కి పైగా స్థానాల్లో బీఆర్‌ఎస్‌ విజయఢంకా మోగిస్తుందని స్పష్టం చేశారు.

సీఎం కేసీఆర్‌ అమలుచేసిన సంక్షేమ పథకాలు దేశంలో మరే రాష్ట్రంలోనూ అమలుకావడం లేదన్నారు. రానున్న ఎన్నికల మ్యానిఫెస్టోలో.. ప్రస్తుత స్కీములే కాక మరిన్ని సంచలనాత్మక స్కీములను సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టనున్నారని తెలిపారు. గతంలో నిత్యం విద్యుత్‌ కోతలతో అల్లాడేవాళ్లమని.. ఈ పదేళ్లలో విద్యుత్‌ సమస్యలను బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పరిష్కరించిందన్నారు. ప్రస్తుతం వ్యవసాయానికి కూడా 24 గంటల విద్యుత్‌ ఇస్తున్నామన్నారు. విద్యా వ్యవస్థలోనూ సంపూర్ణ మార్పులు తీసుకొచ్చామని, ప్రతి పాఠశాలలో 100 శాతం మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక వైద్య రంగంలోనూ గొప్ప సంస్కరణలు తీసుకొచ్చామని, ప్రతి గ్రామం, పట్టణంలో ఆసుపత్రులు నిర్మించామని తెలిపారు. వీటితో పాటు రోడ్లు, బ్రిడ్జిలు, సబ్‌స్టేషన్లు నిర్మించామని తెలిపారు. మిషన్‌ భగీరథ ద్వారా ప్రతిరోజూ మంచినీరు అందిస్తున్నామని కొప్పుల తెలిపారు.

ప్రస్తుత ఎన్నికల్లో ధర్మపురిలో తన గెలుపు ఖాయమన్నారు. మెజారిటీ అనేది ఒక్కోసారి పెరగొచ్చు.. ఒక్కోసారి తగ్గొచ్చని వివరించారు. ధర్మపురి పట్టణంలో కీలక సమస్యలకు పరిష్కారం చూపామన్నారు. నియోజకవర్గంలో లక్షా 26వేల ఎకరాలకు కొత్తగా నీటి వసతి కల్పించామని తెలిపారు. తనపై కొందరు చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని కొప్పుల స్పష్టం చేశారు. టెంపుల్‌ సిటీ అయిన ధర్మపురిని మరింత ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. ప్రత్యేక డ్రైనేజీ వ్యవస్థ ద్వారా ఒక్క చుక్క మురుగు నీరు కూడా గోదావరిలో కలవకుండా చేశామని తెలిపారు. గోదావరి పరివాహక ప్రాంతం మొత్తాన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తామన్నారు. ధర్మపురి పట్టణం ముంపునకు గురికాకుండా.. ఒక్క చుక్క గోదావరి నీరు జనావాసాల్లోకి రాకుండా.. పటిష్ట రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు కేటీఆర్‌తో మాట్లాడానని.. వచ్చే ఎన్నికల్లో స్థానికంగా ఇదే ప్రధాన హామీ అని తెలిపారు.

Advertisment
తాజా కథనాలు