Kakani: చర్యలు తీసుకోవాలి.. లేదంటే చేసేది ఇదే.. మంత్రి కాకాణి హాట్ కామెంట్స్..!

ఎన్నికల్లో పోలీసులు, కొంతమంది అధికారులు ఎకపక్షంగా వ్యవహరించారన్నారు మంత్రి కాకాణి. నెల్లూరులో టీడీపీ నేత సోమిరెడ్డి నేరుగా డబ్బులు పంపిణీ చేశారని ఆరోపించారు. జిల్లా ఎన్నికల అధికారిపై ఫిర్యాదు చేస్తామని.. వారిపై చర్యలు తీసుకోకుంటే న్యాయవ్యవస్థను ఆశ్రయిస్తానని పేర్కొన్నారు.

New Update
Kakani: చర్యలు తీసుకోవాలి.. లేదంటే చేసేది ఇదే.. మంత్రి కాకాణి హాట్ కామెంట్స్..!

Minister Kakani: రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో పోలీసులు, కొంతమంది అధికారులు ఎక పక్షంగా వ్యవహరించారన్నారు మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి. ఎన్నికలను సంబంధిత అధికారులు సక్రమంగా జరపలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని కల యంత్రాంగం ఎప్పుడు లేని విధంగా వైఫల్యం పొందిందన్నారు. నెల్లూరు జిల్లాలో టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నేరుగా డబ్బులు పంపిణీ చేశారని ఆరోపించారు. వీడియో సాక్ష్యాధారాలతో ఎన్నికల అధికారికి పంపినట్లు తెలిపారు.

Also Read: మద్యపాన నిషేధం.. ఈ హామీ వెనుక ఉన్న అసలు కథ ఇదే.!

జిల్లా ఎన్నికల అధికారిపై ఉన్నత స్ధాయి అధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. ఈ విషయంపై చర్యలు తీసుకోవాలని లేదంటే న్యాయ వ్యవస్థను ఆశ్రయిస్తానని పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద కనీసం మంచినీళ్లు కూడా ఏర్పాటు చేయలేదని కామెంట్స్ చేశారు. కొన్ని ప్రాంతాల్లో పోలీసులు లేరని.. హోమ్ గార్డులు కూడా కాకుండా NCC వారిని నియమించారని వ్యాఖ్యానించారు.

Advertisment
తాజా కథనాలు