Minister Jogi Ramesh: కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం మద్దూరు గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష 2.0 కార్యక్రమంలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ.. బీద బడుగు బలహీన వర్గాల వారి కోసం, అగ్రకుల పేదవారి కోసం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
Also Read: అక్రమ ఇసుక దోపిడిపై రేపు టీడీపీ, జనసేన ఆందోళనలు
ప్రజలు అనారోగ్యం నుంచి కోలుకోవడమే కాకుండా ఎంతోమంది ఆయుష్షుని పెంచాలని ఒక దృఢ సంకల్పంతో తలపెట్టిన కార్యక్రమమే జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం అని అన్నారు. తమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధం అనే కార్యక్రమం ద్వారా ఎన్నికలకు వెళ్లుతున్నారని అన్నారు. ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతో జగన్ ఎన్నికలకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు.
Also Read: చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం ఘటనపై భువనేశ్వరి దిగ్భ్రాంతి
ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. చంద్రబాబు నాయుడు ఆలోచన ఏ విధంగా ఉంది అంటే, ఏ పార్టీలతో పొత్తు పెట్టుకోవాలి, మరల ప్రజలను ఎలా మోసం చేయాలి అనే ఆలోచనతో ఉన్నారని అన్నారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ తో పొత్తు పెట్టుకుని, ఇప్పుడు బీజేపీ అధినాయకులు మోడీ, అమిత్ షా,నడ్డా వెంట పడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: ఒంగోలులో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం
Jogi Ramesh: పవన్ కళ్యాణ్ తో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నది ఇందుకే: మంత్రి జోగి రమేష్
చంద్రబాబుపై మంత్రి జోగి రమేష్ విమర్శలు గుప్పించారు. ఏ పార్టీలతో పొత్తు పెట్టుకోవాలి, మరల ప్రజలను ఎలా మోసం చేయాలనే చంద్రబాబు ఆలోచిస్తున్నారన్నారు. అందుకే పవన్ కళ్యాణ్ తో పొత్తు పెట్టుకుని, ఇప్పుడు బీజేపీ అధినాయకుల వెంట పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.