Harish Rao: అన్నీ చేసినం.. మళ్లీ గెలుస్తాం: హరీష్ రావు

తెలంగాణ రాష్ట్రాన్ని పట్టించుకోని నాయకత్వమే ఇప్పుడు తెలంగాణలో అధికారంలోకి రావాలని పరితపిస్తోందంటూ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ పార్టీని విమర్శించారు.1969లోనే కాంగ్రెస్.. తెలంగాణను కాలరాసిందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చామని చెప్పుకునే హక్కు ఆ పార్టీకి లేదని.. ప్రజలు పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నారని తెలిపారు.

Harish Rao: అన్నీ చేసినం.. మళ్లీ గెలుస్తాం: హరీష్ రావు
New Update

బీఆర్ఎస్ పార్టీ మూడోసారి అధికారంలోకి రావాలని తమ వ్యూహాలకు పదును పెడుతోంది. ఈ నేపథ్యంలో మంత్రి హరీష్ రావు హరీష్‌రావు ఆర్‌టీవీతో పలు కీలక విషయాలు పంచుకున్నారు. గతంలో తెలంగాణ రాష్ట్రాన్ని పట్టించుకోని నాయకత్వమే ఇప్పుడు తెలంగాణలో అధికారంలోకి రావాలని పరితపిస్తోందంటూ కాంగ్రెస్ పార్టీని విమర్శించారు.1969లోనే కాంగ్రెస్.. తెలంగాణను కాలరాసిందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చామని చెప్పుకునే హక్కు ఆ పార్టీకి లేదని.. ప్రజలు పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నారని తెలిపారు.అలాగే ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా 11 రోజులు అమరణ నిరాహర దీక్ష చేసిన ఘనత కేసీఆర్‌దని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రతి విషయాలపై అవగాహన ఉన్న నాయకుడు కేసీఆర్ అని పేర్కొన్నారు. ఆయనకు ఉన్న అవగాహన, పరిపాలనలో పోటీపడే నాయకులు ఎవరైనా ఉన్నారా అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాలను సంపూర్ణంగా అమలు చేస్తున్నామని తెలిపారు.

తలసరి ఆదాయంలో, ఐటీ ఉద్యాగాల కల్పనలో రాష్ట్రంలో మొదటిస్థానంలో ఉందని హరీష్ రావు అన్నారు. ప్రభుత్వ విధానాల వల్లే.. బడా కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని తెలిపారు. అలాగే పారిశ్రామిక, వ్యవసాయ రంగాలతో సహా అన్నీ రంగాల ప్రజలను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలా చేస్తున్నామని.. ఇప్పటికే నీతి ఆయోగ్ నుంచి రాష్ట్రానికి ఎన్నో అవార్డులు వచ్చాయని తెలిపారు. గతంలో తాము ప్రవేశపెట్టిన పథకాలనే విపక్ష పార్టీలు కాపీ కొడుతున్నాయంటూ ఎద్దేవా చేశారు. శాసనసభ సమావేశాల్లో కూడా కరెంటు, నీటి సమస్య గురించి ఏ విపక్ష నాయకులు ప్రశ్నించలేరని.. ఎందుకంటే తాము ఈ సమస్యలను పూర్తిగా పరిష్కరించామని అన్నారు. ఇక నియామకాల విషయంలో గతంలో 60 శాతం లోకల్.. 40 శాతం నాన్ లోకల్ వాళ్లకి ఉద్యోగాలు ఇచ్చేవారని.. రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ 95 శాతం స్థానికులకే ఉద్యోగాలు వచ్చేలా రాష్ట్రపతి ఉత్తర్వులను సవరణ చేశారని అన్నారు. ఇకనుంచి ఏ జిల్లాలో వారికి వారి జిల్లాలోనే 95 శాతం ఉద్యోగాలు వస్తాయని పేర్కొన్నారు.

Also Read: మంథనిలో బీఆర్ఎస్‌కు షాక్… చల్లా నారాయణరెడ్డి పార్టీకి రాజీనామా

ఇక స్కిల్ స్కాం కేసులో అరెస్టైన చంద్రబాబు గురించి కూడా హరీష్ రావు స్పందిచారు. దేశ రాజకీయాల్లో ట్రెండ్ మారిపోయిందని.. వ్యవస్థలను అడ్డం పెట్టుకొని వ్యక్తులను నియంత్రించే ప్రయత్నాలు పెరిగిపోయాయని అన్నారు. వాస్తవానికి ఇలాంటి జరకూడదని.. దీనివల్ల యువత కూడా రాజకీయాల్లోకి రావడానికి మొగ్గు చూపని పరిస్థితి నెలకొంటోంజని పేర్కొన్నారు. ఇక తాజాగా రాహుల్ గాంధీ.. సీఎం కేసీఆర్‌పై కేంద్రం ఎలాంటి సీబీఐ, ఐటీ కేసులు పెట్టలేదని చేసిన ఆరోపణలపై కూడా హరీష్ రావు స్పందించారు. కేసీఆర్ ఎలాంటి అవినీతి చేయలేదని అందుకే ఆయనపై ఎలాంటి కేసులు లేవని.. మీరు అవినీతి చేయడం వల్లే మీపై కేసులు ఉన్నాయంటూ రాహుల్ గాంధీని విమర్శించారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ఢిల్లీ నుంచి నేతలు వస్తే తప్ప కనీసం ప్రచారం చేసుకునే పరిస్థితి లేదని పేర్కొన్నారు. కేసీఆర్‌తో మ్యాచింగ్ లేని నాయకులు లేకపోవడం వల్లే ఢిల్లీ నుంచి నేతల్ని తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉందని తెలిపారు. ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే ఈ ఇంటర్వ్యూని చూడండి.

#harish-rao #telangana-elections-2023
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe