Gummanur Jayaram: ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్.. వైసీపీ నాయకుడికి మంత్రి గుమ్మనూరు జయరాం బెదిరింపులు..!

కర్నూలు జిల్లా హరికేర మండలంలో వైసీపీ నాయకుడు వీరేష్ ను బెదిరించారు మంత్రి గుమ్మనూరు జయరాం. ఏం అతి ఉత్సాహం చూపిస్తున్నావు..చాలా స్పీడ్ అయితే.. బ్రేకులు పడుతాయ్ చూసుకో అంటూ వీరేష్ ను పరుషపదాలతో దూషించినట్లు తెలుస్తోంది. మంత్రి జయరాం మాట్లాడిన ఆడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

Gummanur Jayaram: ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్.. వైసీపీ నాయకుడికి మంత్రి గుమ్మనూరు జయరాం బెదిరింపులు..!
New Update

Minister Gummanur Jayaram:  నీ అంతు చూస్తా అంటూ నిన్ననే కర్నూలు జిల్లా అస్పరీ ZPTC దొరబాబును ఫోన్ చేసి బెదిరించారు మంత్రి గుమ్మనూరు జరాయం సోదరుడు గుమ్మనూరు నారాయణ. రెండు నెలలు ఆగు నిన్ను నరికేస్తామంటూ ఫోన్లో బెదిరింపులకు దిగిన ఆడియో ఒకటి వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ఘటన మరువకముందే..ఏకంగా మంత్రి గుమ్మనూరు జరాయం ఓ వైసీపీ నాయకుడిని బెదిరించినట్లు తెలుస్తోంది.

ఫోన్ కాల్ సంభాషణలో ఏమన్నారంటే?

కర్నూలు జిల్లా హరికేర మండలంలో వైసీపీ నాయకుడు వీరేష్ ను బెదిరించారు మంత్రి గుమ్మనూరు జయరాం. ఏం అతి ఉత్సాహం చూపిస్తున్నావు.. చాలా స్పీడ్ అయితే.. బ్రేకులు పడుతాయ్ చూసుకో అంటూ వీరేష్ ను హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ ఛాన్స్ అంటూ పరుషపదాలతో దూషించినట్లు తెలుస్తోంది. మంత్రి జయరాం మాట్లాడిన ఆడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

Also Read: ఆయుర్వేద వంటకం..5 నిమిషాల్లో గ్యాస్, యాసిడ్, తలనొప్పి మటుమాయం

జగనన్న అభిమానంతో పని చేస్తున్నాం అని వీరేష్ అన్నారు.. కండ్లు ఏమైనా ముసుకుపోయాయనుకున్నావా? అంటూ వీరేష్ పై మండిపడ్డారు. వీరేష్ మాట్లాడుతూ.. నేనేమన్నా వేరే పార్టీలో పోయినానా వైసీపీ పార్టీలో ఉన్న కదా అన్న.. నీకోసం ప్రాణాలు తెగించి కష్టపడ్డాను అన్న అని మాట్లాడారు. మంత్రి మాట్లాడుతూ.. సర్పంచ్ నాగరాజు నిన్ను చంపేస్తాను అంటూ బెదిరించినప్పుడు.. ఆ టైంలో నిన్ను, సర్పంచును  మా ఇంటి పిలిపించి రాజీ చేసిన అని గుర్తు చేశారు. వీరేష్ మాట్లాడుతూ.. వాళ్ల పై ఉన్న రౌడీషీటర్ ను తీసేలా చేశావ్ కానీ..మాపై ఉన్న రౌడీషీటర్లు తీసివేయ లేదు కదా అన్న.. ఎస్పీ తమను ఆఫీసుకు పిలిపించుకుని తీవ్రంగా  కొట్టారన్నారు వైసీపీ నాయకుడు వీరేష్.

Also Read: పోషకాల్లో రారాజు.. విటమిన్లతో నిండిన బొప్పాయి తింటే మీరు కింగే

#andhra-pradesh
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe