Minister Gudivada Amarnath: నాలుగేళ్లలో వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి చూడటానికి సిద్ధంగా ఉన్నామని వైవీ సుబ్బారెడ్డికి షర్మిల సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. డేట్, టైమ్ మీరు చెప్పినా.. మమ్మల్ని చెప్పమన్నా ఓకే.. ఎక్కడ అభివృద్ధి చేశారో చూపించండి.. నేను మీడియాను తీసుకొని వస్తా అని షర్మిల (YS Sharmila) చేసిన కామెంట్స్ అధికార పార్టీలో హాట్ టాపిక్ గా మారాయి. తాజాగా, షర్మిల వ్యాఖ్యలకు మంత్రి అమర్నాథ్ రివర్స్ కౌంటర్ ఇచ్చారు.
Also Read: కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై గవర్నర్ సీరియస్
అభివృద్ధి జరగలేదని కావాలనే ప్రభుత్వంపై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని వ్యాఖ్యనించారు. షర్మిల గారు మీరు ఎక్కడికి వస్తారో చెప్పండి.. అక్కడికి వచ్చి మేము చేసిన అభివృద్ధిని చూపిస్తామంటూ ధీమ వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే బీజేపీ, వైసీపీకి (YCP) ఎలాంటి సంబంధం లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వనికి, రాష్ట్ర ప్రభుత్వానికి వున్న బంధమే తప్ప రాజకీయ సంబంధాలు లేవని వివరించారు.
Also Read: కళ్యాణ్ కన్నింగ్ ప్లాన్..కావ్యను చీరతో కట్టి రాజ్ ఏం చేశాడంటే?
అటువంటి రిలేషన్ చంద్రబాబుకు (Chandrababu) బీజేపీతో జాతకట్టే ఇతర పార్టీలకు ఉండాలని అన్నారు. ఇదిలా ఉండగా, ఈ నెల 27న భీమిలి వేదికగా ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికల ప్రచారం సీఎం ప్రారంభిస్తారని చెప్పుకొచ్చారు. తాను ఏ రకంగా ఉపయోగపడతానో అలానే జగన్ ఉపయోగించుకుంటారని.. నా బాధ్యత జగన్ దేనని పేర్కొన్నారు.