జగన్ పాలనపై పుస్తకాన్ని ఆవిష్కరించిన మంత్రి ధర్మాన.!

'జగన్మోహనం అభివృద్ధి పథంలో ఆంధ్రప్రదేశ్' అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు మంత్రి ధర్మాన. సీఎం జగన్ ప్రవేశపెట్టిన కొత్త విధానాలతో పాటు వైసీపీ పాలనను వివరిస్తూ రచయిత వేణుగోపాల్ రెడ్డి పుస్తకంను రచించారు.

Dharmana: వైవీ సుబ్బారెడ్డిపై మంత్రి ధర్మాన షాకింగ్ కామెంట్స్..!
New Update

Minister dharmana: 'జగన్మోహనం అభివృద్ధి పథంలో ఆంధ్రప్రదేశ్' అనే పుస్తకంను రచయిత వేణుగోపాల్ రెడ్డి రచించారు. ఏపీలో సీఎం జగన్ పాలనపై ఈ పుస్తకం రాసినట్లు తెలుస్తోంది. ఇవాళ ఏపీ సచివాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. రచయిత వేణుగోపాల్ రెడ్డి పూర్తిగా అధ్యయనం చేశాకే ఈ పుస్తకం రాశారని ధర్మాన తెలిపారు.

Also Read: మంత్రి రోజా నుంచి ప్రాణహాని.. ప్రేమ జంట సంచలన వ్యాఖ్యలు.!

పరిపాలనలో సీఎం జగన్ ప్రవేశపెట్టిన కొత్త విధానాలను ఈ పుస్తకంలో వివరించడం వల్ల వాటి గురించి భవిష్యత్ తరాలకు తెలుస్తుందని అన్నారు. రచయిత వేణుగోపాల్ రెడ్డికి ప్రభుత్వం, పార్టీ తరఫున హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటున్నట్టు ధర్మాన వెల్లడించారు. 'జగన్మోహనం అభివృద్ధి పథంలో ఆంధ్రప్రదేశ్' పుస్తక రచయిత వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ, ఏపీ అభివృద్ధి విషయంలో సీఎం జగన్ కు ఉన్న స్పష్టతను ఈ పుస్తకంలో పొందుపరిచానని వివరించారు. పుస్తకావిష్కరణ చేసిన మంత్రి ధర్మానకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Also Read: ఓట్లు చీలనివ్వను అని పవన్ కళ్యాణ్ అనడానికి రీజన్ ఇదే..!

కాగా, వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రజలను ఆకర్షించేందుకు వైసీపీ వివిధ కార్యక్రమాలతో ముందుకు వెళ్తోంది. వైసీపీ సామాజిక బస్సుయాత్ర అంటూ రకరకాల కార్యక్రమాలు చేస్తోంది. తాజాగా, జగన్ పాలనపై పుస్తకాన్ని ఆవిష్కరించడం వంటి కార్యక్రమం నిర్వహించింది. అలాగే, సీఎం జగన్ కథతో వ్యూహం అనే సినిమాను త్వరలో విడుదల చేయనున్నారు.

#ycp #ap-minister-dharmana-prasada-rao
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe