Dharmana: వైవీ సుబ్బారెడ్డిపై మంత్రి ధర్మాన షాకింగ్ కామెంట్స్..!
వైవీ సుబ్బారెడ్డిపై మంత్రి ధర్మాన పరోక్ష విమర్శలు చేశారు. కడప నుంచి శ్రీకాకుళం వచ్చి.. భూములు ఆక్రమించేందుకు పావులు కదుపుతున్నారని మండిపడ్డారు. ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారు ఈ జిల్లా భూములను, ఆస్తులను తీసుకోవడమేంటని ప్రశ్నించారు.
Minister Dharmana: వైవీ సుబ్బారెడ్డిపై మంత్రి ధర్మాన ప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. భూములు ఆక్రమించేందుకు కొంతమంది కడప నుంచి శ్రీకాకుళం వచ్చి.. పావులు కదుపుతున్నారని పరోక్షంగా విమర్శలు చేశారు. ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారు ఈ జిల్లా భూములను, ఆస్తులను తీసుకోవడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాగే కొనసాగితే.. చివరకు బయట ప్రాంతాల వారి చేతుల్లోకి మన భూములు వెళ్లి పోతాయని జిల్లా ప్రజలకు హెచ్చరించారు.
శ్రీకాకుళంలో కొంతమంది కళింగ వైశ్యులు వైసీపీలో చేరిన సందర్భంగా మంత్రి ధర్మాన మాట్లాడుతూ… అవినీతి లేని రాజకీయాలు ఉండాలన్నారు. తనకు రాజకీయాలు శాశ్వతం కాదని ఓడినా, గెలిచినా మీ స్నేహితుడనేనంటూ వ్యాఖ్యానించారు. రాజకీయాలంటే భౌతికంగా కన్పించే అంశాలే కాదని.. ప్రశాంత జీవనానికి కావాల్సిన అంశాలను కూడా చేకూర్చడమేనని అన్నారు. తాను అధికారంలో ఉన్నా..లేకున్నా మీ స్నేహితుడిగానే ఉంటానని చెప్పుకొచ్చారు.
తాను విశ్రాంతి కావాలని సీఎం జగన్ కు చెప్పినా తనను పోటీ చేయాలని అన్నారన్నారు. ఆయన మాటకు కట్టుబడి ఈసారి ఎన్నికల బరిలో ఉన్నానని తెలిపారు. ఇదే తనకు చివరి ఎన్నికలని స్పష్టం చేశారు. కాగా మంత్రి ధర్మాన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి.

Also Read: జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తు టెన్షన్
శ్రీకాకుళంలో కొంతమంది కళింగ వైశ్యులు వైసీపీలో చేరిన సందర్భంగా మంత్రి ధర్మాన మాట్లాడుతూ… అవినీతి లేని రాజకీయాలు ఉండాలన్నారు. తనకు రాజకీయాలు శాశ్వతం కాదని ఓడినా, గెలిచినా మీ స్నేహితుడనేనంటూ వ్యాఖ్యానించారు. రాజకీయాలంటే భౌతికంగా కన్పించే అంశాలే కాదని.. ప్రశాంత జీవనానికి కావాల్సిన అంశాలను కూడా చేకూర్చడమేనని అన్నారు. తాను అధికారంలో ఉన్నా..లేకున్నా మీ స్నేహితుడిగానే ఉంటానని చెప్పుకొచ్చారు.
Also Read: అసమ్మతి నేతలను బుజ్జగించేందుకు చంద్రబాబు ప్రయత్నాలు..!
తాను విశ్రాంతి కావాలని సీఎం జగన్ కు చెప్పినా తనను పోటీ చేయాలని అన్నారన్నారు. ఆయన మాటకు కట్టుబడి ఈసారి ఎన్నికల బరిలో ఉన్నానని తెలిపారు. ఇదే తనకు చివరి ఎన్నికలని స్పష్టం చేశారు. కాగా మంత్రి ధర్మాన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి.
Also Watch This Video: