Mia Khalifa: ‘మియా ఖలీఫా’కు షాక్ ఇచ్చిన ఆ ఒక్క ట్వీట్.. ఇంతకీ ఏం జరిగిందంటే..

మియా ఖలీఫా.. పాలిస్తానాకు సపోర్ట్ చేస్తూ ఎక్స్(ట్విట్టర్) వేదికగా ఓ పోస్ట్ చేసింది. ఇజ్రాయిల్‌పై దుమ్మెత్తిపోసింది. అయితే, ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్ అవడం, ప్రపంచ వ్యాప్తంగా ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఇక పాలస్తీనాకు సపోర్ట్ చేసిన నేపథ్యంలో.. పలు వ్యాపార సంస్థలు మియా ఖలీఫాతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసుకున్నాయి.

New Update
Mia Khalifa: ‘మియా ఖలీఫా’కు షాక్ ఇచ్చిన ఆ ఒక్క ట్వీట్.. ఇంతకీ ఏం జరిగిందంటే..

Mia Khalifa Has Been fired from Multiple Organization: పోర్న్ వ్యవస్థ నుంచి బయటకొచ్చి.. తనకంటూ ప్రత్యేక లైఫ్‌ను క్రియేట్ చేసుకున్న ‘మియా ఖలీఫా’(Mia Khalifa) ఏరికోరి సమస్యలను కొనితెచ్చుకుంది. ఇజ్రాయెల్(Israel)-హమాస్(Hamas) యుద్ధం నేపథ్యంలో మియా ఖలీఫా చేసిన ఓ పోస్ట్.. ఆమెకు గట్టి ఎదురుదెబ్బ తగిలేలా చేసింది. ఆ తరువాత నుంచి ఇక స్పందించడమే మానేసింది. ఇంతకీ ఏం జరిగిందో ఓసారి తెలుసుకుందాం. ఇజ్రాయెల్‌పై హమాస్ అకస్మాత్తుగా దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ వార్ నేపథ్యంలో స్పందించిన మియా ఖలీఫా.. పాలిస్తానాకు సపోర్ట్ చేస్తూ ఎక్స్(ట్విట్టర్) వేదికగా ఓ పోస్ట్ చేసింది. ఇజ్రాయిల్‌పై దుమ్మెత్తిపోసింది. అయితే, ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్ అవడం, ప్రపంచ వ్యాప్తంగా ఆమె స్పందనకు మిశ్రమ స్పందనలు రావడం కూడా జరిగిపోయింది. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఆ తరువాతే ఆమెకు పెద్ద షాక్ తగిలింది. పాలస్తీనాకు సపోర్ట్ చేసిన నేపథ్యంలో.. ఓ సంస్థ మియా ఖలీఫాతో చేసుకున్న పోడ్‌కాస్ట్ ఒప్పందాన్ని రద్దు చేసుకుంది.

కెనడియన్ బ్రాడ్‌కాస్ట్, రేడియో సంస్థకు చెందిన టాడో షాపిరో తో మియా ఖలీఫా పోడ్‌కాస్ట్ హోస్ట్‌గా ఒప్పందం చేసుకుంది. అయితే, ఇజ్రాయిల్, హమాస్ యుద్ధం నేపథ్యంలో ఆమె.. పాలస్తీనాకు సపోర్ట్ చేయడంతో టాడో షాపిరో ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించారు.

సోషల్ మీడియాలోనూ విమర్శలు..

ఇజ్రాయెల్‌పై హమాస్ ఆకస్మిక దాడి తర్వాత ఎక్స్‌లో పోస్ట్ పెట్టి మియా.. పాలస్తీనాకు సంఘీభావం తెలిపింది. ఈ వీడియోను చూసి నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

మియా ఖలీఫా ఏం పోస్ట్ చేసిందంటే..

‘మీరు పాలస్తీనాలోని పరిస్థితిని చూసి పాలస్తీనియన్ల వైపు నిలబడకుండా ఉంటున్నారంటే.. మీరు ఖచ్చితంగా వర్ణ వివక్షత కలిగి ఉన్నారని అర్థం. కాలమే ఇలాంటి ఘటనకు సమాధానం చెబుతుంది.’ అంటూ ట్వీట్ చేసింది.

publive-image

ఈ ట్వీట్‌కు స్పందించిన టాడ్ షాపిరో.. వెంటనే యాక్షన్ తీసుకున్నారు. ‘ఇది చాలా భయంకరమైన ట్వీట్.. ఈ క్షణమే మిమ్మల్ని తొలగించడం జరుగుతుంది. ఇది చాలా అసహ్యంగా అనిపిస్తోంది. అంతకు మించే అని చెప్పాలి. మనిషిగా కొంచెం పరిణతి పొందండి. మరణం, అత్యాచారం, కొట్టడం, బందీలుగా తీసుకోవడం అనే నిజాలను మీరు అంగీకరించాలి. మీ అజ్ఞానాన్ని ఏ పదాలు వివరించలేవు. ముఖ్యంగా విషాదాన్ని ఎదుర్కొన్నప్పుడు మనుషులు కలిసి రావాలి. మీరు మంచి వ్యక్తిగా మారాలని నేను ప్రార్థిస్తున్నాను.’ అంటూ ట్వీట్ చేశారు.

ఇదొక్కటే కాదు.. మియా ఖలీఫాతో చాలా సంస్థలు తమ ఒప్పందాలను రద్దు చేసుకున్నాయి. వరుస షాక్‌లతో మియా ఖలీఫా సోషల్ మీడియాలో సైలెంట్ అయిపోయింది.

హమాస్ శాంతి జపం..

మరోవైపు ఇజ్రాయిల్, హమాస్ యుద్ధం కొనసాగుతోంది. రెండు వైపులా ఇప్పటి వరకు 1200 కంటే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయినట్లు నివేదికలు చెబుతున్నాయి. అదే సమయంలో వేలాది మంది తీవ్రంగా యపడ్డారు. ఈ యుద్ధం ఇలా కొనసాగుతుండగానే.. మిలిటెంట్ గ్రూప్ హమాస్.. సంధి కోసం బహిరంగ ప్రకటన చేసింది. శాంతిని నెలకొల్పేందుకు, విస్పోటనానికి స్వస్తి పలుకుదామని పిలుపునిచ్చింది. తదుపరి నష్టం లేకుండా, విధ్వంసాన్ని నివారించేందుకు ముందుకు రావాలంటూ శాంతి ప్రకటన చేసింది.

Also Read:

TS elections 2023: బాబోయ్.. ఎన్నికల వేళ రోడ్లపైకి నోట్ల కట్టలు.. ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు..!

Nara Lokesh CID: ముగిసిన నారా లోకేష్ సీఐడీ విచారణ

Advertisment
Advertisment
తాజా కథనాలు