Men Health: పురుషులకు స్పెషల్.. ఇవి తింటే ఆ సమయంలో ఫుల్ ఎనర్జీ వస్తుందట..!

వంధ్యత్వంతో బాధపడుతున్న పురుషులు కొన్ని రకాల ఆహారాలు తినాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. టొమాటో, గుమ్మడి గింజలు, ఒమేగా-3, విటమిన్ బి, ఈ, తృణధాన్యాలు, పాలు వంటి ఆహారాలు తింటే స్పెర్మ్ కౌంట్ పెరుగుతుందట.

Men Health: పురుషులకు స్పెషల్.. ఇవి తింటే ఆ సమయంలో ఫుల్ ఎనర్జీ వస్తుందట..!
New Update

Men Health Special: ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్కరు ఉరుకులు పరుగుల జీవితాన్ని సాగిస్తున్నారు. బిజీ షెడ్యూల్‌తో సమయానికి తినకపోవడం, సమయానికి నిద్రపోకపోవడం జరుగుతుంది. ఫలితంగా.. ప్రజలు అనేక వ్యాధుల బారిన పడుతున్నారు. ముఖ్యంగా, స్థూలకాయం, ఊబకాయం, మధుమేహం, రక్తపోటు వంటి సమస్యలతో సతమతం అవుతున్నారు. వీటి కారణంగా.. పురుషుల్లో లైంగిక సామర్థ్యానికి సంబంధిన సమస్యను ఎదుర్కొంటున్నారు. వంధ్యత్వం సమస్యతో బాధపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కొన్ని పరిశోధనల ప్రకారం.. గడిచిన 40 ఏళ్లలో సగటు పురుషుని స్పెర్మ్ కౌంట్ క్రమంగా తగ్గుముఖం పట్టినట్లు తేలింది. ఇది సంతానోత్పత్తిపై ప్రభావం చూపుతోంది.

మానవ శరీరంలోని ఇతర అవయవాల మాదిరిగానే.. పునరుత్పత్తి వ్యవస్థ పనితీరు కూడా ఉంటుంది. దానికి అందే పోషకాలు, విటమిన్లపై ఆధారపడి ఉంటుంది. పోషకాలు ఒక వ్యక్తి పునరుత్పత్తి వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇవి టెస్టోస్టెరాన్ ఉత్పత్తిని పెంచుతాయి. తద్వారా స్పెర్మ్ కౌంట్, స్పెర్మ్ చలనశీలత, నాణ్యతను పెంచుతుంది. పునరుత్పత్తి ఆరోగ్యానికి తోడ్పడే అవసరమైన పోషకాలను అందించడం ద్వారా కొన్ని ఆహారాలు పురుషుల సంతానోత్పత్తికి దోహదం చేస్తాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. మరి స్పెర్మ్ కౌంట్‌ను పెంచే ఆహారాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

పండ్లు, కూరగాయలు: బెర్రీలు, సిట్రస్ పండ్లు, ఆకు కూరలలో విటమిన్ సి, ఇ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కోవటానికి, స్పెర్మ్ కణాలను దెబ్బతినకుండా కాపాడటానికి సహాయపడతాయి.

గింజలు, విత్తనాలు: వాల్‌నట్‌లు, అవిసె గింజలు ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలను కలిగి ఉంటాయి. ఇవి స్పెర్మ్ నాణ్యత, చలనశీలతను పెంచుతాయి. ఈ కొవ్వులు స్పెర్మ్ కణ త్వచాల నిర్మాణంలో అంతర్భాగంగా ఉంటాయి.

చేప: చేపలు, ముఖ్యంగా సాల్మన్, సార్డినెస్ వంటి రకాలు సెలీనియం కలిగి ఉంటాయి. ఈ ఖనిజం ఆరోగ్యకరమైన స్పెర్మ్ ఉత్పత్తికి అవసరం. ఆక్సీకరణ నష్టాన్ని నివారించడంలో సహాయపడుతుంది.

తృణధాన్యాలు: బ్రౌన్ రైస్, వోట్స్ వంటి తృణధాన్యాల్లో జింక్ పుష్కలంగా ఉంటుంది. ఇది పురుషుల సంతానోత్పత్తికి కీలకమైన ఖనిజం. జింక్ స్పెర్మ్ ఉత్పత్తి, టెస్టోస్టెరాన్ జీవక్రియలో పాల్గొంటుంది.

లీన్ ప్రోటీన్లు: పౌల్ట్రీ, పాల ఉత్పత్తులలో లీన్ ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి. L-అర్జినైన్ అనేది అమైనో ఆమ్లం. ఇది నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తికి సపోర్ట్ ఇవ్వడం ద్వారా స్పెర్మ్ కౌంట్, స్పెర్మ్ చలనశీలతను మెరుగుపరుస్తుంది.

పాల ఉత్పత్తులు: పాల ఉత్పత్తులు స్పెర్మ్ పనితీరుకు అవసరమైన కాల్షియంను అందిస్తాయి. పాలలో విటమిన్ డి కూడా ఉంటుంది. టెస్టోస్టెరాన్ ఉత్పత్తిలో కూడా పాత్ర పోషిస్తుంది.

కూరగాయలు: ఆస్పరాగస్, బ్రోకలీ వంటి కూరగాయలలో ఫోలేట్ ఉంటుంది. ఇది బీ-విటమిన్ అందిస్తుంది. స్పెర్మ్ నాణ్యతను పెంచుతుంది. క్రోమోజోమ్ అసాధారణతల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

గుమ్మడికాయ గింజలు: గుమ్మడికాయ గింజలలో ఫైటోస్టెరాల్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి టెస్టోస్టెరాన్ ఉత్పత్తికి, మొత్తం పునరుత్పత్తి ఆరోగ్యానికి ప్రయోజనం చేకూరుస్తాయి.

టమోటాలు: టొమాటోల్లో లైకోపీన్‌ను ఉంటాయి. మెరుగైన స్పెర్మ్ చలనశీలతతో సంబంధం ఉన్న యాంటీఆక్సిడెంట్ టొమాటోలో ఉంటాయి. టొమాటోలను ఉడికించడం వల్ల ఎక్కువ లైకోపీన్ విడుదల అవుతుంది.

అలాగే, సమతుల్య ఆహారం, హైడ్రేటెడ్ గా ఉండటంతో పాటు.. అధిక ఆల్కహాల్, ధూమపానానికి దూరంగా ఉండటం పునరుత్పత్తి ఆరోగ్యానికి కీలకం అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.

Also Read:

వైరల్ అవుతున్న వీడియో.. క్లారిటీ ఇచ్చిన ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి..

కొత్త రేషన్‌కార్డులు వచ్చేస్తున్నాయ్‌.. రూల్స్‌ ఇవేనా?!

#men-health-special
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి