మెహ్రీన్ మండిపాటు.. సెక్స్ సీన్స్‌కు మ్యారిటల్ రేప్ కు తేడా తేలియదా..?!

అది సెక్స్ సీన్ కాదు.. మ్యారిటల్ రేప్ అంటూ హీరోయిన్‌ మెహ్రీన్ పిర్జాదా ట్వీట్టర్ లో మండిపడింది. సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ వెబ్ సిరీస్ పై వచ్చిన విమర్శలకు నటి మెహ్రీన్‌ కౌంటర్ ఇచ్చింది. ఈ సిరీస్ లో మెహ్రీన్ కొన్ని లిప్ లాక్ సీన్స్ తో పాటు, పెళ్లి తర్వాత భర్త ఫోర్స్ చేసే సన్నివేశాల్లో బోల్డ్ గా నటించింది. అయితే, మీ ఇంట్లో వాళ్లకు ఇలా జరిగితే అప్పుడు కూడా ఇలాగే మాట్లాడుతారా? అంటూ ట్విట్టర్ వేదికగా మెహ్రీన్ ప్రశ్నించింది. అంతే కాదు కేవలం కథలో భాగంగా నటించానని ఫైర్ అయింది.

New Update
మెహ్రీన్ మండిపాటు.. సెక్స్ సీన్స్‌కు మ్యారిటల్ రేప్ కు తేడా తేలియదా..?!

Mehreen Pirzada: అది సెక్స్ సీన్ కాదు.. మ్యారిటల్ రేప్ అంటూ హీరోయిన్‌ మెహ్రీన్ పిర్జాదా ట్వీట్టర్ లో మండిపడింది. సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ వెబ్ సిరీస్ పై వచ్చిన విమర్శలకు నటి మెహ్రీన్‌ కౌంటర్ ఇచ్చింది. దారుణమైన రేప్ ను సెక్స్ సీన్లుగా వర్ణించడం బాధేస్తోందని వెల్లడించింది. ఈ సిరీస్ లో మెహ్రీన్ కొన్ని లిప్ లాక్ సీన్స్ తో పాటు, పెళ్లి తర్వాత భర్త ఫోర్స్ చేసే సన్నివేశాల్లో బోల్డ్ గా నటించింది.  అయితే, మ్యారిటల్ రేప్ ను సూచించే సన్నివేశాన్ని సెక్స్ సీన్లుగా ఎలా అంటారని మెహ్రీన్ మండిపడింది.

ఇటీవల హీరోయిన్స్ అంతా ఓటీటీల్లోకి(OTT) ఎంట్రీ ఇచ్చి బోల్డ్ సన్నివేశాలతో రెచ్చిపోతున్నారు. ఇటీవల తమన్నా ఓటీటీ సిరీస్ లలో రెచ్చిపోయి మరీ బోల్డ్ సీన్స్ లో నటించగా.. తాజాగా మెహ్రీన్ కూడా సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ వెబ్ సిరీస్ లో బోల్డ్ సీన్స్ లో నటించింది. దీంతో ఆమెపై సోషల్ మీడియాలో త్రీవ విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఆ విమర్శలకు కౌంటర్ ఇస్తూ నటి మెహ్రీన్‌ ట్వీట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చింది.


మ్యారిటల్ రేప్.. భార్యకు ఇష్టం లేకున్నా భర్త ఫోర్స్ చేయడం మ్యారిటల్ రేప్ గా పేర్కొంటారని మెహ్రీన్ వివరణ ఇచ్చింది. ప్రస్తుత సమాజంలో చాలామంది ఈ సమస్యను ఎదుర్కొంటున్నారని, బయటకు చెప్పుకోలేక బాధపడుతున్నారని వివరించింది. వాస్తవంలో ఇది చాలా భయంకరమైన అనుభవమని పేర్కొంది. ఇలాంటి సన్నివేశం తను నటించిన వెబ్ సిరీస్ లో ఉందని చెబుతూ.. అలాంటి దారుణమైన సీన్ ను కొన్ని వర్గాలు సెక్స్ సీన్లుగా అభివర్ణించడం చూసి చాలా బాధపడ్డానని తెలిపింది.

Also Read: సినిమాలో ఆ పాత్ర చేయవద్దని చాలామంది చెప్పారు: శ్రీలీల

కొన్ని కథలు అలాంటి సన్నివేశాలను డిమాండ్ చేస్తాయని, అయితే కథలో భాగంగానే వాటిని చేయాల్సి వస్తుందని మెహ్రీన్ చెప్పింది. ఓ యాక్టర్ గా కథలో భాగంగా వచ్చే సన్నివేశాలలో నటించడం తన విధి అని తెలిపింది. సుల్తాన్ ఆఫ్ ఢిల్లీలో నటించడానికి తనకు ఎలాంటి అసౌకర్యం కలగలేదని వివరించింది. అయితే, మ్యారిటల్ రేప్ ను సూచించే సన్నివేశాన్ని సెక్స్ సీన్లుగా ఎలా అంటారని మెహ్రీన్ మండిపడింది. మీ ఇంట్లో వాళ్లకు ఇలా జరిగితే అప్పుడు కూడా ఇలాగే మాట్లాడుతారా? అంటూ ట్విట్టర్ వేదికగా మెహ్రీన్ ప్రశ్నించింది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు