Jobs: తెలంగాణలోని నిరుద్యోగ యువతీయువకులకు శుభవార్త. రాష్ట్రంలో మరో భారీ జాబ్ మేళా( Job Mela)కు సంబంధించిన ప్రకటన రిలీజ్ అయ్యింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను చూస్తే..నిరుద్యోగులకు ప్రైవేట్ రంగం(Private sector)లో ఉపాధి అవకాశాలను కల్పించేందుకు ఈ మధ్యే పలు స్వచ్చంద సంస్థలు, ట్రస్టులు రాజకీయ నాయకుల ఆధ్వర్యంలో భారీగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నాయి. ఈ జాబ్ మేళా ద్వారా వేలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తున్నారు. తాజాగా జాతీయ యువజన దినోత్సవం(National Youth Day) సందర్భంగా మెగాజాబ్ మేళా(Mega job mela)ను నిర్వహిస్తున్నారు.
ఈనెల 12వ తేదీన సికింద్రాబాద్ లోని కమిషనర్ ఆఫ్ యూత్ సర్వీసెస్(Commissioner of Youth Services), బోట్స్ క్లబ్ సమీపంలో ఈ జాబ్ మేళాను నిర్వహిస్తున్నారు. ఉదయం 10గంటల నుంచి ప్రారంభం అవుతుంది. ఈ జాబ్ మేళాలో పాల్గొనే నిరుద్యోగ యువతీ యువకులు 18 ఏళ్ల నుంచి 35 మధ్య వయస్సు ఉండాలి. దాదాపు 65కు పైగా కంపెనీలు ఈజాబ్ మేళాలో పాల్గొంటున్నాయి. మొత్తం 5వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
అర్హతలు:
పది, ఇంటర్, అండర్ గ్రాడ్యుయేట్, డిప్లొమా, బిఫార్మా, ఎంఫార్మా, హోటల్ మేనేజ్ మెంట్, బీఈ, బీటెక్, ఎంటెక్, బీఎ, బీఎస్సీ, బీకామ్, ఎంబీఏ, ఎంసీఏ, ఎంపీఎస్, పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన అభ్యర్థులు ఈ జాబ్ మేళాకు హాజరు కావచ్చు. ఈ ఉద్యోగాలు టీఎస్ స్టేప్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. పూర్తి సమాచారం కోసం ఈహెల్ప్ లైన్ నెంబర్ 7097655912 లేదా 9642333668 లేదా 888671191 ఫోన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.
ఇది కూడా చదవండి: రూ.50 వేల కోట్లను కొట్టేసిన మేఘా.. ఆ రూ.500 కోట్ల ఖర్చును ఎలా తప్పించుకుంది?