India First Female Doctor: కాదంబినీ గంగూలీ భారతదేశంలో మొట్టమొదటి వైద్యురాలు. ఆధునిక వైద్యంలో డిగ్రీతో ప్రాక్టీస్ చేసిన మొదటి భారతీయ మహిళల్లో ఆమె ఒకరు. కాదంబిని భాగల్పూర్ (నేటి బీహార్)లోని బెంగాలీ కుటుంబంలో జన్మించింది. ఆమె బరిసాల్ (ప్రస్తుత బంగ్లాదేశ్)లో పెరిగింది. కాదంబిని డాకాలోని బ్రహ్మో ఈడెన్ ఫిమేల్ స్కూల్‌లో ఆంగ్ల విద్యను అభ్యసించింది. ఆ తర్వాత కలకత్తాలోని బల్లిగంజ్‌లోని హిందూ మహిళా విద్యాలయానికి వెళ్లింది.
ఈ పాఠశాల తరువాత 1878లో బెతున్ స్కూల్‌తో విలీనం అయ్యింది. దీని వలన కాదంబిని కలకత్తా విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన మొదటి మహిళగా అవతరించింది. కాదంబినీ గంగూలీ, చంద్రముఖి బసు బెతున్ కళాశాలలో మొదటి గ్రాడ్యుయేట్లు, దేశంలో పట్టభద్రులైన మొదటి మహిళలు వీరే. ఆమె భారత జాతీయ కాంగ్రెస్‌లో మొదటి మహిళా స్పీకర్ కూడా. మహిళల విద్య, హక్కుల కోసం పోరాడిన ధైర్యవంతురాలు కాదంబినీ గంగూలీ. గంగూలీ అక్టోబర్ 3, 1923న కన్నుమూశారు. మరణించే కొన్ని గంటల ముందు కాదంబినీ గంగూలీ ఆపరేషన్ చేశారు. ఆమె తండ్రి బ్రహ్మ సమాజ్ సంస్కరణకర్త బ్రాజా కిషోర్ బసు. బ్రహ్మ సమాజ్ కకు చెందిన ద్వారాకానాథ్ గంగూలీని ఆమె వివాహం చేసుకున్నారు. 1861, జులై 18న బిహార్ లోని భాగల్ పూర్ లో కాదంబిని జన్మించారు.
ఇది కూడా చదవండి: గ్రాండ్ గా ఐపీఎల్ ఓపెనింగ్ ఈవెంట్..స్పెషల్ అట్రాక్షన్ గా రెహమాన్.!