Medaram Jatara: మేడారంలో 9 కి.మీ. ట్రాఫిక్ జామ్.. పోటెత్తిన భక్తులు

ఆదివాసుల ఆరాధ్య దైవాల సన్నిధికి భక్తులు పోటెత్తుతున్నారు. మేడారంలో కొలువైన సమ్మక్క సారలమ్మలను దర్శించుకోవడానికి ఇప్పటినుంచే తరలివస్తున్నారు. జాతర మొదలవడానికి ఇంకా చాలా రోజుల సమయం ఉండగానే అక్కడ సందడి మొదలైంది.

New Update
Medaram Jatara: మేడారంలో 9 కి.మీ. ట్రాఫిక్ జామ్.. పోటెత్తిన భక్తులు

Medaram Jatara: ఆదివాసుల ఆరాధ్య దైవాల సన్నిధికి భక్తులు పోటెత్తుతున్నారు. మేడారంలో కొలువైన సమ్మక్క సారలమ్మలను దర్శించుకోవడానికి ఇప్పటినుంచే తరలివస్తున్నారు. జాతర మొదలవడానికి ఇంకా చాలా రోజుల సమయం ఉండగానే అక్కడ సందడి మొదలైంది. వరుస సెలవుల నేపథ్యంలో ఆదివారం రోజు 9 కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ స్తంభించిపోవడం గమనార్హం. మధ్యాహ్నం నుంచే భక్తుల తాకిడి మొదలైంది. జంపన్న వాగు నుంచి చింతల్ ఎక్స్ రోడ్ వరకు వాహనాలు నిలిచిపోయాయి.

ఇదిలా ఉంటే, మేడారం పరిసరాల్లో భారీగా తాగునీటి కొరత ఉందంటున్నారు భక్తులు. దీంతో జాతర పూర్తిస్థాయిలో మొదలైతే పరిస్థితి ఇంకెలా ఉంటుందో అని ఆందోళన చెందుతున్నారు. అధికార యంత్రాంగం దృష్టి సారించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మరోవైపు మంత్రులు సీతక్క, కొండా సురేఖ దగ్గరుండి జాతర ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. కాగా, ముందస్తుగానే లక్షలాదిగా భక్తులు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి తరలివస్తున్నారు. దేశవ్యాప్తంగా భక్తులు భారీగా తరలివచ్చే ఈ మహోత్సవానికి ఈ నెల 30లోగా ఏర్పాట్లు పూర్తిచేయాలని సంబంధిత కాంట్రాక్టర్లకు ప్రభుత్వం డెడ్ లైన్ విధించింది. వచ్చే నెల 21 నుంచి జాతర మొదలు కాబోతోంది. ఈ సారి కోటి మందికి పైగా భక్తులు వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

ఇది కూడా చదవండి: సీఎం రేవంత్‌తో బీఆర్ఎస్ ఎమ్మెల్యే భేటీ.. కేసీఆర్‌కు షాక్?

Advertisment
Advertisment
తాజా కథనాలు