Maruti Electric Air Car : డ్రోన్ కి ఎక్కువ.. హెలికాఫ్టర్ కి తక్కువ.. మారుతి ఎగిరే కారు వచ్చేస్తోంది!

మన దేశీయ కార్ల కంపెనీ మారుతి మరో సంచలనానికి రెడీ అవుతోంది. ఎగిరే ఎలక్ట్రిక్ కారును తీసుకురాబోతోంది. ఈ కారును ఇంటి పై కప్పు మీదే ల్యాండ్ చేసుకోవచ్చు. ఇది మామూలు హెలికాఫ్టర్ కన్నా తక్కువ బరువుతో ఉంటుంది. పైలెట్ కాకుండా ముగ్గురు దీనిలో ప్రయాణించవచ్చని చెబుతున్నారు.

Maruti Electric Air Car : డ్రోన్ కి ఎక్కువ.. హెలికాఫ్టర్ కి తక్కువ.. మారుతి ఎగిరే కారు వచ్చేస్తోంది!
New Update

Maruti Electronics : దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ(Maruti Suzuki) తన మాతృ సంస్థ సుజుకీ మోటార్ కార్పొరేషన్(SMC) సహకారంతో ఫ్లయింగ్ ఎలక్ట్రిక్ కారును తయారు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ ఎలక్ట్రిక్ ఎయిర్ కాప్టర్‌ను ఇంటి పై కప్పు మీద ల్యాండ్ చేయవచ్చు. అక్కడ నుంచే టేకాఫ్ చేసుకోవచ్చు. అంటే మనం గ్యారేజీలో కారు పార్క్ చేసుకున్నట్టు.. ఇంటి పై భాగంలో ఈ ఎయిర్ కార్ పార్క్ చేసుకోవచ్చన్నమాట. 

మీడియా రిపోర్ట్స్ ప్రకారం, ఎగిరే కారును(Maruti Electric Air Car) అభివృద్ధి చేయడానికి జపాన్ స్టార్టప్ స్కైడ్రైవ్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు SMCL వద్ద గ్లోబల్ ఆటోమొబైల్ ప్లానింగ్ విభాగం అసిస్టెంట్ మేనేజర్ కెంటో ఒగురా తెలిపారు. అందుకే దీని పేరు మారుతి స్కైడ్రైవ్ గా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. 

డ్రోన్ కంటే పెద్దగా..
ఈ ఎలక్ట్రిక్ ఎయిర్ కాప్టర్(Electric Air Copter) అంటే ఎగిరే కారు డ్రోన్ కంటే పెద్దదిగా ఉంటుంది.  కానీ మామూలు  హెలికాప్టర్ కంటే చిన్నదిగా ఉంటుంది. అందులో పైలట్‌తో సహా ముగ్గురు కూర్చునే అవకాశం ఉంటుంది. దీనిని పట్టణ ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ టాక్సీ సర్వీస్ గా ఉపయోగించవచ్చు.

మేక్ ఇన్ ఇండియా..
Maruti Electric Air Car తయారీ భారతదేశంలోనే జరిగే అవకాశాలున్నాయి.  ధర కూడా తక్కువగా ఉంటుంది.ఆర్థిక కారణాల రీత్యా భారతదేశంలో ఫ్లయింగ్ కార్ల తయారీని కంపెనీ పరిశీలిస్తోంది. ఇంకా నిర్దిష్ట ప్రణాళిక సిద్ధం కాలేదు, అయినా కూడా భారతదేశంలో దీని తయారీ చేయగలిగితే మంచిదని భావిస్తున్నామని ఒగురా చెప్పారు. ఇందుకోసం విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ అధికారులతో చర్చలు జరుపుతున్నారు. మేక్ ఇన్ ఇండియా కింద ఇక్కడికి వస్తే ఎగిరే కార్లు ఖచ్ఛితంగా ఇక్కడ అందుబాటులో ఉంటాయి.

జపాన్-అమెరికా తర్వాత భారత మార్కెట్లోకి..
ఇది జపాన్‌లో 2025 ఒసాకా ఎక్స్‌పోలో 12 యూనిట్ల మోటార్- రోటర్‌లతో (Maruti Electric Air Car)విడుదల చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ముందుగా, ఈ ఫ్లయింగ్ కారు జపాన్ - అమెరికన్ మార్కెట్లలో అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. దీని తరువాత, 'మేక్ ఇన్ ఇండియా' కింద భారతదేశంలో విక్రయించే ప్రణాళిక ఉంది. భారతదేశంలో కస్టమర్లు - భాగస్వాములను కనుగొనడానికి మేము మార్కెట్ పరిశోధన చేస్తున్నాము అంటూ కెంటో ఒగురా వివరించారు. 

Also Read :  పేటీఎం కష్టాలు పెరుగుతున్నాయి.. చైనా లింకులపై దర్యాప్తు!

మామూలు హెలికాప్టర్ బరువులో సగం..
ఈ ఎయిర్ కాప్టర్ బరువు సంప్రదాయ హెలికాప్టర్ బరువులో దాదాపు సగం ఉంటుంది. దాని తక్కువ బరువు కారణంగా, భవనం పైకప్పుల పైనే దీనిని  టేకాఫ్ - ల్యాండింగ్ చేసే అవకాశం ఉంటుంది. ఎలక్ట్రిక్  కారణంగా విమాన భాగాల సంఖ్య గణనీయంగా తగ్గిందని మీడియా రిపోర్ట్స్ లో పేర్కొన్నారు. అందువల్ల ఈ ఎలక్ట్రిక్ ఎయిర్ కారు తయారీ, నిర్వహణ ఖర్చులు బాగా తగ్గుతాయి. 

ప్రారంభంలో 15 కిలోమీటర్ల పరిధి.. 
మొదట్లో ముగ్గురు ప్రయాణికుల ఎడిషన్ (Maruti Electric Air Car)పరిధి 15 కిలోమీటర్లుగా ఉంటుందని ఓగురా చెప్పారు. దీని తరువాత, దీనిని 2029 నాటికి 30 కిలోమీటర్లకు.. 2031 నాటికి 40 కిలోమీటర్లకు పెంచే అవకాశం ఉంది.  'భారతదేశం పెద్ద దేశం. అందువల్ల మనకు కచ్చితంగా 15 కిలోమీటర్ల కంటే ఎక్కువ పరిధి కావాలి' అని ఆయన అన్నారు.

Watch this Interesting Video :

#electric-air-copter #electric-air-car #maruti-suzuki
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి