/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/bharth-jpg.webp)
Margani Bharath: రాబోయే ఎన్నికల్లో ఓటమి అంగీకరించి కూటమి అభ్యర్థి తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు రాజమండ్రి వైసీపీ అభ్యర్థి మార్గాని భరత్. టీడీపీ నేత ఆదిరెడ్డి శ్రీనివాస్ పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు. అభివృద్ధి పనుల్లో 25 శాతం కమీషన్లు తీసుకుంటున్నానని పదే పదే ఆరోపణలు చేయడంతో రూ. 10 కోట్లు పరువు నష్టం దావా వేస్తున్నట్లు తెలిపారు. తనపై పలు ప్రచార మాధ్యమాల్లో అభివృద్ధి పేరుతో 25% కమిషన్ తీసుకున్నట్లు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను కమిషన్ తీసుకుంటున్నట్లు రుజువు చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు.