/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Maoist-Letter-jpg.webp)
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల (TS Elections 2023) వేడి తారా స్థాయికి వేళ మావోయిస్టు పార్టీ విడుదల చేసిన లేఖ సంచలనంగా మారింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా - అల్లూరి సీతారామరాజు జిల్లా డివిజన్ కమిటీ (BKSR) కార్యదర్శి ఆజాద్ పేరిట మావోయిస్టు పార్టీ ఈ లేఖను విడుదల చేసింది. ఈ లేఖలో ప్రధానంగా ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ (Puvvada Ajay Kumar), మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని (Ponguleti Srinivas Reddy) టార్గెట్ చేసింది మావోయిస్టు పార్టీ. ఈ ఇద్దరు నాయకులు కూడా కార్పొరేట్ రాజకీయ నాయకులేనంటూ ధ్వజమెత్తింది. వీరిలో ఎవరిని గెలిపించినా.. వారి స్వార్థ ప్రయోజనాల కోసమే పని చేస్తారు కానీ.. ప్రజల కోసం కాదని పేర్కొంది. ప్రస్తుతం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ (Congress Party) పొంగులేటి చేతిలో కీలుబొమ్మగా మారిపోయిందని లేఖలో ధ్వజమెత్తారు ఆజాద్ (Azad). పొంగులేటి ఒక్కో నియోజకవర్గానికి రూ.40 కోట్లు, జిల్లా మొత్తం రూ.400 కోట్లు ఖర్చు చేస్తానని అధిష్టానానికి ఆశ చూపుతున్నాడని ఆరోపించారు.
ఇది కూడా చూడండి: TS Congress: కాంగ్రెస్ సెకండ్ లిస్ట్ విడుదల ఎప్పుడంటే?
నిజంగా ప్రజలకు సేవ చేయాలనే తపనున్న అనేక మంది కాంగ్రెస్ ఆశావాహుల ఆశలను, వారి జీవితాలను పొంగులేటి కార్పో రేట్ కత్తి బలితీసుకుంటోందని నిప్పులు చెరిగారు. పొం గులేటి తన అహంకారాన్ని వీడక పోతే ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. మంత్రి పువ్వాడ అజయ్ సైతం జిల్లా అంతా తన చెప్పు చేతల్లో ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాడని మావోయిస్టు పార్టీ ఆరోపించింది. తన వ్యాపార సామ్రాజ్యంలో కేసీఆర్ (KCR) కుటుంబానికి వాటాలు ఇచ్చి జిల్లాను తన గుప్పెట్లో పెట్టుకునేందుకు అజయ్ అహర్నిశలు కష్టపడుతున్నాడని ధ్వజమెత్తింది.
maiost azad press releas..
జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం రూ. 800 కోట్లు ఖర్చు చేసేందుకు ఆయన డబ్బులు సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోందని లేఖలో ఆరోపించారు మావోయిస్టు నేత ఆజాద్. ఈ నేపథ్యంలో రెండు పార్టీల్లో ఏ అభ్యర్థి ఎక్కడి నుంచి గెలిచినా.. పొంగులేటి ప్రయోజనాలనో, పువ్వా డ ప్రయోజనాలనో కాపాడేందుకే ఉపయోగపడతారే తప్పా పేదల ప్రయోజనాలకోసం కాదన్నారు. భూటకపు ఎన్నకల మూలంగా ఎలాంటి ఉపయోగం లేదని ప్రజలు గమనించాలన్నారు. పోరాడి హక్కులు సాధించుకోవాలే తప్పా.. ఈ ఓట్లు, సీట్లతో ఎలాంటి ఉపయోగం ఉండదన్నారు. దొంగ ఓట్ల, దొంగ నోట్ల రాజ్యానికి బుద్ధి చెప్పాలంటే ఈ ఎన్నికలను ప్రజలు బహిష్కరించాలని మావోయిస్టు పార్టీ ఈ లేఖలో పిలుపునిచ్చింది.