అధిక బరువుకు బీరకాయతో చెక్ పెట్టేయండి..! అధిక బరువుతో బాధపడే వారికి బరువును ఎలా తగ్గించుకోవాలో తెలియదు. అలాంటి వారికి బీరకాయ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కూరగాయల్లో ఒక రకమైన బీరకాయ వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. By Durga Rao 27 May 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి బీరకాయ కూరగాయల్లో ఒకటి. బీరకాయతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బీరకాయను ఎలాంటి సమస్యలు ఉన్నావారైనా తినొచ్చు.అయితే చాలా మంది అధిక బరువుతో బాధపడుతున్నారు.అలాంటి వారికి బీరకాయ చాల ఉపయోగంగా మారుతుంది. ఇందులో నీటి శాతం, ఫైబరే కాకుండా ఇంకా ఎన్నో పోషకాలు ఉన్నాయి. అందులోనూ ప్రస్తుతం సమ్మర్ సీజన్. బీరకాయ తినడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు ఒకసారి చూసేయండి. బరువు తగ్గడం కోసం ఉదయం, సాయంత్రం జిమ్‌లకు వెళ్లి శ్రమిస్తుంటారు. అలాంటి వారికి బీరకాయ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే బరువును తగ్గించడంలో బీరకాయ సహాయపడుతుందట. ఆకలిని తగ్గించడమే కాకుండా అతిగా తినడాన్ని నివారిస్తుందట. శరీరంలోని అదనపు నీటిని కూడా తొలగించడం వల్ల.. శరీర బరువు వెంటనే తగ్గే ఉవకాశం ఉంది. అధిక బరువుతో బాధపడేవారు తరచూ బీరకాయ తీసుకోవడం వల్ల కొంతమేరకు లాభం ఉంటుంది. రోగ నిరోధక శక్తిని పటిష్టం చేయడానికి బీరకాయ చాలా ఉపయోగపడుతుంది. ఈ కూరగాయలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే బీరకాయలో జింక్, ఐరన్, పొటాషియం విటమిన్లతో పాటు ఎన్నో ఖనిజాలు ఉంటాయి. ఇవి రోగనిరోధక వ్యవస్థను మరింత మెరుగుపరుస్తాయి. మలబద్ధకం సమస్యతో చాలామంది బాధపడుతుంటారు. అలాంటివారికి బీరకాయ ఎంతో మేలు చేస్తుంది. బీరకాయలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపర్చడం, మలబద్దకాన్ని తగ్గిస్తోంది. ప్రేగు కదలికలను నియంత్రించడంలో, జీర్ణ సమస్యలను నివారించడంలో ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపర్చడం, వృద్ధాప్యాన్ని నివారించడంలో బీరకాయ చాలా బాగా పనిచేస్తుంది. ఇందులో ఉండే విటమిన్ సి, కెరిటన్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ నుంచి చర్మాన్ని రక్షిస్తాయి. ఇక ఇందులో ఉండే సిలికా అనే ఖనిజం చర్మం, జుట్టు, గోళ్లు ఆరోగ్యవంతంగా ఉండేందుకు సహాయపడతాయి. బీరకాయను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చర్మ సౌదర్యం పెరుగుతుంది. #health-benefits-with-birkaya మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి