నేటి నుంచి శ్రీనగర్‎కాలనీ ఆలయంలో మండలపూజా మహోత్సవాలు..!!

భూతనాథ సదానందాః సర్వభూత దయాపర రక్షరక్ష మహాబాహో.. శాస్తేతుభ్యం నమోనమః... పిలిస్తే పలికే కలియుగ వరదుడు, శ్రీ హరిహరపుత్రుడు అయ్యప్పస్వామి సన్నిధానంలో గురువారం నుంచి మండల పూజా మహోత్సవాలు ప్రారంభం అయ్యాయి.

New Update
నేటి నుంచి శ్రీనగర్‎కాలనీ ఆలయంలో మండలపూజా మహోత్సవాలు..!!

భూతనాథ సదానందాః సర్వభూత దయాపర రక్షరక్ష మహాబాహో.. శాస్తేతుభ్యం నమోనమః… పిలిస్తే పలికే కలియుగ వరదుడు, శ్రీ హరిహరపుత్రుడు అయ్యప్పస్వామి సన్నిధానంలో గురువారం నుంచి మండల పూజా మహోత్సవాలు ప్రారంభం అయ్యాయి. హైదరాబాద్ లోని శ్రీనగర్ కాలనీలో శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయ సమూహంలో ఉన్న అయ్యప్ప స్వామి సన్నిధానంలో ఏటా మండలం రోజుల పాటు స్వాములతో పాటు సాధారణ భక్తులకు మధ్యాహ్నం వేళ ఇక్కడ అన్నసంతర్పణ చేస్తారు. రాత్రి స్వాములకు అల్పహారం అందిస్తారు. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు గణపతి హోమం పంచామ్రుత అభిషేకం, అర్చన, మహాహారతి, పడిపూజ ఉంటాయి. డిసెంబర్ 10న అష్టోత్తర కలశాభిషేకం, 17న గజారోహణ వేడుక, 27న లక్షపుష్పార్చన, మహాపూర్ణాహుతి వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని ఆలయ కమిటీ ఛైర్మన్ సీహెచ్ రామయ్య ఈఓ లావణ్య తెలిపారు. ఈ కార్యక్రమాన్ని శ్రీ శ్రీనివాస శర్మ ఆలయ ప్రధాన అర్చకులు, రామక్రిష్ణ ఆర్చక స్వాములచే నిర్వహించబడుతుంది.

publive-imagepublive-imagepublive-image

ఇది కూడా చదవండి: ఒంటరితనం 15 సిగరెట్లు తాగడంతో సమానం…!!

Advertisment
తాజా కథనాలు