ఏపీ రాజకీయాలు(Ap Politics) రోజుకో కొత్త మలుపు తీసుకుంటున్నాయి. టీటీడీ అధినేత చంద్రబాబు నాయుడ్ని అరెస్ట్ చేయడంతో ఆ వేడి మరింత పెరిగింది. ఈ క్రమంలోనే రాజకీయ నాయకులు ఆయన అరెస్ట్ ని ఖండించారు. ఆయన అరెస్ట్ ని నిరసిస్తూ హైదరాబాద్ లో ఐటీ ఉద్యోగులు సైతం ఆయనకు మద్దతు తెలిపి నిరసన వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో సినీ ప్రముఖులు రజినీ కాంత్, రాఘవేంద్రరావు..తదితరులు ఆయన అరెస్ట్ ని ఖండించారు. ఈ క్రమంలో తాజాగా మంచు లక్ష్మీ చేసిన ఓ ట్వీట్ ఏపీ రాజకీయాల్లో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అయితే మంచు వారి ఇంట్లో ఎప్పటి నుంచో కూడా రెండు పార్టీలు ఉన్నాయి. ఈ విషయం అందరికీ తెలిసిందే.
ఎందుకంటే..వైఎస్ కుటుంబం మోహన్ బాబు పెద్ద కోడలికి బంధువులు, చిన్న కోడలు కుటుంబం టీడీపీ తరుఫున వారు. ఈ క్రమంలో మంచువారి కుటుంబం ఎటువైపు నిలుస్తుందో ఎవరికీ తెలియడం లేదు. ఇప్పుడు తాజాగా టీడీపీ జనసేన పొత్తు ఉంటుందని పవన్ ప్రకటించారు.
ఈ క్రమంలో మంచు లక్ష్మీ వావ్..ఇప్పుడు ఏపీ రాజకీయాలు మజా వచ్చేలా ఉన్నాయి..రసవత్తరంగా ఉన్నాయన్నట్లుగా ఆమె ట్వీట్ వేసింది. ఈ ట్వీట్ మీద నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. మంచు లక్ష్మీ పెట్టిన ట్విట్ కి ..కొందరు నెటిజన్లు...'' మీరు కూడా జంప్ చేసే టైం వచ్చింది..ముందు మీరు ఏ గట్టు మీద ఉంటారో చెప్పండి మేడం..అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
అయితే మంచు వారు ఈ ఎన్నికల్లో ఏ పార్టీ తరుఫున నిలుస్తారు అనేది అందరికీ ఆసక్తిగా మారింది. అన్నదమ్ములిద్దరూ వారి కుటుంబ బంధుత్వాలను పంచుకుంటారా? లేక తండ్రిని అనుసరిస్తారా అనేది వేచి చూడాల్సిందే.
ఈ క్రమంలో తెలుగు హీరోలను చూస్తుంటే సిగ్గేస్తుందని టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి(JC prabhakar reddy) అన్నారు. ఆయన్ని కావాలని అక్రమ కేసులో అరెస్ట్ చేసి జైల్లో పెట్టినట్లు ఆయన ఆరోపించారు. దీని గురించి ఎవరు స్పందించడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీలో బతికే రోజులు పోయాయని అన్నారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం కూడా రాష్ట్రాన్ని గురించి మర్చిపోవాల్సిందే అన్నారు. ఒక్క గ్రామానికి కూడా సరైన రోడ్లు లేవు. పరిశ్రమలు లేవు. ఉద్యోగాలు చేద్దామంటే కనీసం పని లేదు. కనీస సౌకర్యాలు అనేవి ఏవి కూడా లేవని ఆయన విమర్శించారు.
రాష్ట్రం ఇంత దారుణంగా ఉంటే కనీసం బాగుచేయాలనే కనీస జ్ఙానం కూడా మీకు లేదా అని ప్రశ్నించారు. ఇది కేవలం రాష్ట్రానికి పట్టిన దుస్థితి మాత్రమే కాదు. చిత్రపరిశ్రమకు పట్టిన దౌర్భగ్యం కూడా. చిత్రసీమ విషయంలో కూడా జగన్ ఎంత దారుణంగా ప్రవర్తించారో మీకు తెలియదా? అంటూ ప్రశ్నించారు.