/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Long-moustache-jpg.webp)
Man With Long moustache: ప్రస్తుత కాలంలో చాలా మంది పురుషులు.. మీసాలు, గడ్డాలను వెరైటీ వెరైటీ లుక్‌లో పెంచుకుంటున్నారు. మీసాలు, గడ్డం వ్యక్తి లుకింగ్‌ను కూడా పెంచుతాయనేది వాస్తవం. అందుకే.. ఆ మీసం, గడ్డంను ట్రెండీగా, అందంగా సెట్ చేసుకుంటారు. అయితే, మరికొందరు ఉంటారు. మీసం, గడ్డంపై మక్కువ ఎక్కువ. చాలా ఇష్టంగా పెంచుకుంటారు. ఇలా ఇష్టంగా మీసం పెంచుకుని ఇప్పుడు అందరినీ అబ్బురు పరుస్తున్నాడు. అతని మీసాలు ఊస్తే బాబోయ్ ఇంత పెద్ద మీసమా? అని షాక్ అవుతారు. ఎందుకంటే.. ఆ మీసాలు మామూలుగా లేవు. రెండు వైపులా కలిపి సుమారు 10 అడుగులకు మించి పొడవుగా పెంచేశాడు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఈ భారీ మీసాల మనిషి పేరు వనమాల సూరిబాబు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దమ్మపేటకు చెందిన వ్యక్తి. ఇతని మీసాల పొడవు సుమారు 10 అడుగులు. గత 20 ఏళ్లుగా ఇతను తన ఈ మీసాలు పెంచుకుంటున్నాడు. ముత్తాత, తాత, తండ్రి, తరాల నుండి ఇలా మీసాలు చెంచుతూ వస్తున్నారట. పైగా ఇతను తన మీసాల సంరక్షణ కోసం అదనంగా ఒక్కరూపాయి కూడా ఖర్చు చేయకుండా మెడిమిక్స్ సబ్బుతో స్నానం చేసి మీసాలకు నునె పూయడానికి, దువ్వడానికి రోజూ మూడు గంటల టైమ్ మాత్రమే కేటాయిస్తునట్లు సూరిబాబు తెలిపాడు. ఈయన ఎక్కడికి వెళ్లిన మీసాల బాబాయ్ అంటూ పిలిచి సెల్ఫీలు దిగుతున్నారని, అది తనకెంతో గర్వంగా ఉందని తెలిపాడు. తన ఊరిలో కూడా ఇంటిపేరు పెట్టి పిలవరని మీసాల సూరిబాబు అనే పిలుస్తారని సూరిబాబు ఎంతో గర్వంగా చెప్తున్నాడు. ఇంకా ఐదు అడుగులు మీసాలు పెంచి రికార్డ్ సాధించాలన్నదే తన లక్ష్యం అని సూరిబాబు తెలిపాడు.
Also Read: