కన్నబిడ్డను చూడనివ్వనందుకు..భార్య, అత్తమామలను చంపిన భర్త...!

అస్సాంలోని గోలాఘాట్ జిల్లాకి చెందిన నజీబుర్ రెహమాన్ బోరా (25), సంఘమిత్ర ఘోష్ (24) ప్రేమ పెళ్లి చేసుకున్నారు. దంపతుల మధ్య ఏర్పడిన మనస్ఫర్ధల కారణంగా సంఘమిత్ర తన బిడ్డతోపాటు తల్లిదండ్రుల ఇంటివద్దనే ఉంటోంది. తన కుమారుడిని చూపించాలంటూ వెళ్లిన రెహమాన్ కు, అత్తామామల మధ్య ఏర్పడిన ఘర్షణ కారణంగా రెహమాన్ తన భార్య సహా అత్తామామలను దారుణంగా హత్య చేశాడు. అనంతరం తన తొమ్మిది నెలల బిడ్డతో పోలీసులకు లొంగిపోయాడు.

కన్నబిడ్డను చూడనివ్వనందుకు..భార్య, అత్తమామలను చంపిన భర్త...!
New Update

వాళ్లిద్దరు ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. కొంత కాలం తర్వాత వారి కాపురంలో కలతలు రేగాయి.పుట్టింటికి వెళ్లిపోయిన భార్యాబిడ్డల కోసం వెళ్లాడు.తన బిడ్డను చూపించమని అడిగాడు.

publive-image

అత్తమామలతో జరిగిన  వాగ్వాదం తారాస్థాయికి చేరుకుంది. దీంతో కోపోద్రుక్తుడైన భర్త..తన భార్య సహా అత్తమామలను అతి దారుణంగా హత్య చేశాడు. అనంతరం తన తొమ్మిది నెలల బిడ్డను తీసుకుని వెళ్లి పోలీసులకు లొంగిపోయాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.అస్సాంలోని గోలాఘాట్ జిల్లాకి చెందిన నజీబుర్ రెహమాన్ బోరా (25), సంఘమిత్ర ఘోష్ (24) మధ్య కోవిడ్ లాక్ డౌన్ లో ప్రేమ మొదలైంది. అయితే సంఘమిత్ర కుటుంబ సభ్యులు వారి ప్రేమను అంగీకరించలేదు.

publive-image

దీంతో ప్రేమికులిద్దరు కోల్ కతాకు పారిపోయి పెళ్లి చేసుకున్నారు.పోలీసుల సాయంతో సంఘమిత్ర తలిదండ్రులు సంజీవ్ ఘోష్, జునూ ఘోష్ తమ కూతురును తిరిగి ఇంటికి తీసుకొచ్చారు.తమ అంగీకారం లేకుండా సంఘమిత్ర పెళ్లిచేసుకోడాన్ని వారు జీర్ణించుకోలేక పోయారు.

ఆమె భర్త రెహమాన్ బోరాకు విడాకులివ్వాల్సిందిగా ఒత్తిడి తెచ్చారు. కుటుంబ సభ్యుల బలవంతానికి సంఘమిత్ర తలవంచలేదు. దీంతో ఆమెపై దొంగతనం కేసు పెట్టారు. ఈ కేసు విషయంలోనే ఆమె నెల రోజుల పాటు జైలులో ఉండి వచ్చింది.

అనంతరం సంఘ మిత్రను ఆమె తలిదండ్రులే  బెయిల్ ఇప్పించి మళ్లీ ఇంటికి తీసుకెళ్లారు గడపదాటకుండా కట్టుదిట్టం చేశారు. అయినా సరే 2022 జనవరిలో రెండోసారి నజీబుర్ రెహమాన్ తో సంఘమిత్ర ఇంటిలోనుంచి  వెళ్లిపోయింది.

భార్యాభర్తలిద్దరూ చెన్నై వెళ్లిపోయి అక్కడ 5 నెలల పాటు ఉన్నారు. సంఘమిత్ర గర్భవతి కావడంతో నజీబుర్ రెహమాన్ తన భార్యను తీసుకొని స్వస్థలమైన గోలాఘాట్ కు వచ్చి అక్కడే ఉండసాగాడు.

గత నవంబర్ లో రెహమాన్ దంపతులకు మగబిడ్డ జన్మించాడు. అయితే భర్త తనను వేధిస్తున్నాడంటూ గత మార్చిలో సంఘమిత్ర తన బిడ్డను తీసుకొని తల్లిదండ్రుల ఇంటికి వెళ్లిపోయింది.

అవకాశం కోసం ఎదురుచూస్తున్న సంఘమిత్ర తలిదండ్రులు ఆమె భర్త రెహమాన్ పై అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టారు.ఈ నేపథ్యంలో రెహమాన్ నెల రోజులు జైల్లో శిక్షఅనుభవించి బెయిల్ మీద బయటకు రావాల్సి వచ్చింది.

ఈ క్రమంలో రెహమాన్ తన కుమారుడిని చూపించాలంటూ భార్య, అత్తామామలను అడిగాడు. అయితే అందుకు వాళ్లు ఒప్పుకోకపోవడంతో సోమవారం అత్తారింటికి వెళ్లిన నజీబుర్ రెహమాన్ బోరా...భార్య, అత్తామామలను దారుణంగా హత్య చేశాడు.

అనంతరం తొమ్మిది నెలల కొడుకును తీసుకొని పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. కాగా ఈ కేసు విషయంలోనే బాధిత కుటుంబాన్ని అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ పరామర్శించారు.

#man-killed-wife-and-her-parents
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe