భార్య కనుబొమ్మల ఆకృతి నచ్చలేదని ఫోన్ లో ట్రిపుల్ తలాక్ చెప్పాడు ఓ భర్త. ఈ ఘటన కాన్పూర్ లో చోటు చేసుకుంది. గుల్సైబా అనే మహిళ జనవరి 2022 లో సలీమ్ ను వివాహం చేసుకుంది. పెళ్లి తరువాత అతను ఉద్యోగ నిమిత్తం సౌదీకి వెళ్లిపోయాడు. కొద్ది రోజుల క్రితం సలీమ్ గుల్సైబాకు వీడియో కాల్ చేసిన సమయంలో ఆమె కనుబొమ్మల ఆకృతి నచ్చలేదని ఆమెకు ఫోన్లోనే మూడు సార్లు తలాక్ చెప్పాడు.
దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. తన భర్త సలీమ్ సౌదీకి ఉద్యోగ నిమిత్తం వెళ్లినప్పటి నుంచి కూడా అత్తమామలు తనను కట్నం కోసం వేధించేవారని ఆమె పేర్కొంది. ఆ సమయంలో తన భర్తకు కూడా తన మీద లేనిపోనివి చెప్పేవారని ఆమె వివరించింది. అంతే కాకుండా కొంచెం ఆధునికంగా ఉన్నాసరే వారు ఒప్పుకునే వారు కాదని ఆమె తన ఫిర్యాదు లో పేర్కొంది.
Also read: రోడ్డు ప్రమాదంలో ఫిల్మ్ మేకర్ మృతి..ప్రాణాలు పోతున్న పట్టించుకోని ప్రజలు!
ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం తన భర్తతో వీడియో కాల్ మాట్లాడుతున్న సమయంలో తన కనుబొమ్మల ఆకృతి బాలేదని ఆమె పై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు ఆమెతో ఈ రోజు నుంచి నిన్ను ఈ పెళ్లి నుంచి విముక్తి చేస్తాను అంటూ మూడు సార్లు తలాక్ చెప్పాడు. ఆ తరువాత అతనితో మాట్లాడాటానికి ఎంతో ప్రయత్నించినట్లు ఆమె తెలిపింది.
బాధితురాలి ఫిర్యాదు మేరకు ఆమె భర్త, అత్తమామలతో పాటు మరో ఐదుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. “నాకు పెళ్లయి ఏడాది మాత్రమే అయింది. అతనిపై పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను” అని ఆమె అన్నారు.